Annadata Sukhibhava Scheme : రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. అన్నదాత సుఖీభవ పథకం ఏర్పాటు 20000 కావాలంటే ఇలా చేయండి..!
ప్రధానాంశాలు:
Annadata Sukhibhava Scheme : రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. అన్నదాత సుఖీభవ పథకం ఏర్పాటు 20000 కావాలంటే ఇలా చేయండి..!
Annadata Sukhibhava Scheme : ఏపీ రైతులకు ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్ధిక సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. అర్హులైన ఏపీ రైతులకు ఏడాదికి 20000 రూపాయలు లబ్దిపొందుతారు. ఖరీఫ్ సీజన్ ముగింపు టైం లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సహయాన్ని అందిస్తుంది. ఈ పథకం కోసం కొత్త అప్లికేషన్ ఇంకా క్రమబద్ధీకరణకు సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చిన్న ఇంకా సన్నకారు రైతులను ఆదుకునేందుకు వారికి అండగా ఉండేందుకు ఏపీ ప్రభువం ఈ అన్నదాత సుఖీభవ ప్రారంభించింది. ఆర్ధిక సహాయంగా 20000 రూపాయలు రెండు విరాళాల్లో ఇవ్వనున్నారు. వీటిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్రం నుంచి 6000 ఒకసారి.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14000 రూపాయలు ఒకసారి వస్తాయి. రైతులు ఎదుర్కొంటున్న ఆర్ధిక భారాన్ని తగ్గించేందుకు ఈ పథకం ప్రవేశ పెట్టారు.
Annadata Sukhibhava Scheme ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలు..
అన్నదాత సుఖీభవ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభిస్తుంది. అందులోనే సులభంగా దరఖాస్తు చేసుకుని రైతులు ఈ సొమ్ము పొందవచ్చు. ఈ పోర్టల్ ద్వారా దాదాపు 5.5 మిలియన్ల మంది రైతుల ప్రయోజనాలు చేకూరుతాయని తెలుస్తుంది.
ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలు పోర్టల్ లో దరకాస్తు చేసుకోవాలి. భూమి యాజమాన్యం రుజువు అవసరం కోసం సంబందించిన జిరాక్స్ లు ఇవ్వాలి. ఇంకా దీనికి సంబందించిన పూర్తి డీటైల్స్ కోసం అన్నదాత సుఖీభవ పోర్టల్ ను సందర్శించాలి. దరఖస్తు ఫారం పూర్తి చేసే టైం లో పేరు మొబైల్ నెంబర్ చిరునామా ఆధార్ నెంబర్ భూమి పాస్ బుక్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు అన్ని సంబంధిత పత్రాలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.