YS Sharmila : షర్మిలకు రాణియోగం కాంగ్రెస్ లో రాదు .. వేణు స్వామి సంచలన కామెంట్స్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : షర్మిలకు రాణియోగం కాంగ్రెస్ లో రాదు .. వేణు స్వామి సంచలన కామెంట్స్..!!

 Authored By aruna | The Telugu News | Updated on :5 January 2024,6:30 pm

YS Sharmila : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నారు. తాజాగా వేణు స్వామి వై.యస్.షర్మిల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏపీలో తన అన్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటే ఎంపీ సీటు వచ్చేది. రాజయోగం పట్టేది. కానీ ఆమె జాతకరీత్యా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. ఆమె సొంతంగా పార్టీ పెట్టడం వలన తెలంగాణలో ఎటువంటి ఉపయోగం కలగలేదు. కాంగ్రెస్లో ఉన్న ఆమెకు రాజయోగం ఉండదని తన అన్న జగన్ వెంట ఉంటే ఆమెకు రాజయోగం పడుతుందని, చెల్లికి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎంపీ పదవి ఇచ్చేవారని వేణు స్వామి అన్నారు.

ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె ప్రభావం ఎంత మాత్రం ఉండదని చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా వై.యస్.షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినంత మాత్రాన ఆమె ప్రభావం ఏమాత్రం ఉండదని వేణు స్వామి అన్నారు. వై.యస్.షర్మిల ఇన్ని కష్టాలు కడాల్సిన అవసరం లేదని, సీఎం చెల్లిగా ఆమె హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అని కానీ ఆమె తీసుకుంటున్న నిర్ణయాల వలన ఆమె చాలా కష్టపడుతున్నారు కానీ ఫలితం దక్కదు అని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎంగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కి ముఖ్యమంత్రి యోగం లేదని ఎమ్మెల్యే గా గెలుస్తారని వేణు స్వామి ఉన్నారు.

దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇటీవల వేణు స్వామి చెబుతున్న జాతకాలు బెడిసి కొడుతున్నాయి. ప్రభాస్ కెరియర్ డౌన్ అవుతుందని, తెలంగాణలో మళ్లీ కేసిఆర్ వస్తారని చెప్పారు. కానీ ప్రభాస్ సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక కెసిఆర్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. అయినా కూడా వేణు స్వామి వాటన్నింటినీ కవర్ చేస్తూ జాతకాలు చెబుతూనే ఉన్నారు. తాజాగా వై.యస్.షర్మిల జాతకం గురించి చెప్పి రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది