Botsa Satyanarayana : బొత్స వర్సెస్ చిన్న శీను.. సొంత మేనల్లుడే మేకు అయ్యాడా.. జగన్ అసలు ప్లాన్ ఏంటి?
Botsa Satyanarayana : బొత్స సత్యనారాయణ గురించి తెలుసు కదా. ఆయన ప్రస్తుతం ఏపీ మంత్రి. చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యే. ఎలాగూ మంత్రినే కదా. వచ్చే ఎన్నికల్లోనూ చీపురుపల్లి నుంచి బొత్సకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారులే అని అనుకుంటున్నారా? అక్కడే మీరు పప్పులో కాలేసేది. ఎందుకంటే.. ప్రస్తుతం బొత్స కుటుంబంలో విభేదాలు నడుస్తున్నాయి. బొత్స సత్యనారాయణకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ లో చాలామంది వైసీపీలో ఉన్నారు. బొత్స సోదరుడు లక్ష్మణరావు, మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, బొత్స అప్పల నర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు.. వీళ్లంతా వైసీపీలో కీలక పదవుల్లోనే ఉన్నారు.
కానీ.. ప్రస్తుతం వీళ్లలో వీళ్లకే పొసగడం లేదు. అందుకే ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న బొత్సకు వచ్చే ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. చీపురుపల్లి నుంచి తన మేనల్లుడు చిన్న శీనును బరిలోకి దింపాలని వైసీపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా చిన్న శీను తెర వెనుక ఉండి నడిపిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బొత్స మంత్రిగా ఉన్నారు కదా. అదే చీపురుపల్లి నుంచి తాను పోటీ చేస్తే.. తనకు కూడా మంత్రి పదవి వస్తుందని చిన్న శ్రీను భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే బొత్సను అక్కడి నుంచి తప్పించడం కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Botsa Satyanarayana : చీపురుపల్లిలో పోటీ చేసి గెలిచి మంత్రి పదవి సాధించాలనేది చిన్న శీను ప్లాన్
చిన్న శ్రీను జగన్ కు సన్నిహితుడు కావడంతో శ్రీను ఏది అనుకుంటే అది జరుగుతోంది. అందుకే బొత్స కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్న బడ్డుకొండ అప్పలనాయుడికి వ్యతిరేకంగా బొత్స సోదరుడు లక్ష్మణరావు పావులు కదుపుతున్నారు. దీంతో ఆయన బావమరిది అయిన చిన్న శ్రీనుకు నచ్చడం లేదు. తన మేనమామ బొత్స సత్యనారాయణ కంటే కూడా తన బావమరిది బొడ్డుకొండ అప్పలనాయుడి వైపే చిన్న శ్రీను నిలబడుతుండటంతో బొత్స ఫ్యామిలీలో గొడవలు ఇంకాస్త పెరిగాయి. మరి.. ఈనేపథ్యంలో ఎన్నికల వరకు టికెట్లు ఎవరికి కేటాయిస్తారో వేచి చూడాల్సిందే.