Chandrababu : నీకు టికెటే ఇవ్వడం లేదు కదా మీ జగనన్న.. రోజాపై చంద్రబాబు ఫన్నీ కామెంట్స్ వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : నీకు టికెటే ఇవ్వడం లేదు కదా మీ జగనన్న.. రోజాపై చంద్రబాబు ఫన్నీ కామెంట్స్ వైరల్

Chandrababu : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికలు అనగానే మనకు గుర్తొచ్చేది అభ్యర్థుల ప్రకటన, ప్రచారం. ఇంకా ఎన్నికలకు 4 నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక, ప్రకటన, ప్రచారంపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. అయితే ఈసారి ఏపీలో విచిత్రమైన ఎన్నికలు జరగబోతున్నాయి. వార్ వన్ సైడే అన్నట్టుగా వార్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :15 December 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  వాళ్ల క్యాండిడేట్స్ అంతా తాడేపల్లి ఆమోదం

  •  ఈ సమరం సైకో జగన్, రాష్ట్ర ప్రజల మధ్య

  •  రాష్ట్ర ప్రజలంతా ముందుకు రావాలి

Chandrababu : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికలు అనగానే మనకు గుర్తొచ్చేది అభ్యర్థుల ప్రకటన, ప్రచారం. ఇంకా ఎన్నికలకు 4 నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక, ప్రకటన, ప్రచారంపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. అయితే ఈసారి ఏపీలో విచిత్రమైన ఎన్నికలు జరగబోతున్నాయి. వార్ వన్ సైడే అన్నట్టుగా వార్ మొత్తం జగన్ మీద ప్రకటించేశారు. మిగితా పార్టీలు అన్నీ కలిసి జగన్ మీద వార్ ప్రకటించాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే కలిసిపోయాయి. ఇక మిగిలింది బీజేపీ. ఈ పార్టీ కూడా కలిస్తే.. ఈ మూడు పార్టీలు శక్తివంతం అవుతాయి. ఈ మూడు పార్టీలు కలిసి వైసీపీని ఢీకొడితే ఖచ్చితంగా జగన్ కు ఓటమే అని అంటున్నారు. మరోవైపు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత చంద్రబాబు ఫుల్ ఫైర్ మీదున్నారు. ఏమాత్రం తగ్గడం లేదు. ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వాళ్ల క్యాండిడేట్స్ తాడెపల్లి ఆమోదం.. మా క్యాండిడేట్స్ ప్రజామోదం. రేపు జరగబోయేది సైకో జగన్ కి, రాష్ట్ర ప్రజలకు మధ్య. అందరం కలిసి పోరాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందామని.. దానికి మీరంతా ముందుకు రావాలని చంద్రబాబు కోరారు.

నూతన విధానం కూడా నేను ఎవ్వరికీ చెప్పను. నాకు తప్ప ఆ సమాచారం ఎక్కడా ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ బయట పెడితే లేనిపోని అనుమానాలు వస్తాయి. అందరికీ కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్తాం. ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయాలి. రాజకీయ నాయకులే కాదు.. రాజకీయ కార్యకర్తలే కాదు.. ప్రజలు కూడా త్యాగం చేసే పరిస్థితి రావాలి. అప్రమత్తంగా ఉండాలి.. ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు చంద్రబాబు. ప్రజాభిప్రాయం కూడా తీసుకుంటాం. ముందే ప్రకటిస్తాం. పొత్తులు ఉన్నాయి. సీట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. క్యాండిడేట్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఏదైతే బాబు గ్యారెంటీ.. ఇస్తున్నామో దాని మీద ప్రజల్లో చాలా ఆసక్తి ఉంది. ప్రజలే వచ్చి తీసుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చి తీసుకుంటున్నారు. పచ్చి మోసాలు చేసి మేము ఇచ్చామని అంటున్నారు కానీ.. వాళ్లు ఏం చేయలేదు. మద్యపానం నిషేధం పూర్తిగా పెట్టిన తర్వాతనే ఓటు అడుగుతాం అన్నారు. లేకపోతే ఓటు అడగం అన్నారు. మరి మద్యపానం నిషేధం చేశారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

Chandrababu : ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్

ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్. అతడు టోటల్ గా ఫెయిల్ అయ్యాడు. నువ్వు దోపిడి చేస్తా ఉంటే.. ఎవరు అడిగినా కేసులు పెడతావా. మీ ఇష్ట ప్రకారం దొంగ ఓట్లు వేయడానికి, నకిలీ ఓట్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీ యంత్రాంగం సమాయత్తమైంది. దాన్ని తిప్పికొడతాం. 46 వేల బూతుల్లో మా వాళ్లు వర్క్ చేస్తున్నారు. రిమోట్ గా ఓట్లు యాడ్ చేసి డిలీట్ చేసే పరిస్థితికి వచ్చారు. బీఎల్ఏనే ఫామ్ 6 ఇవ్వాలి. ఇవన్నీ పెట్టినా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది. తెలంగాణలో ఏపీ ఓటర్లు ఉంటే ఇక్కడికి వచ్చి ఓటు వేయకూడదా? వేరే రాష్ట్రాలకు వాళ్లు ఎందుకు వెళ్తున్నారు. ఇక్కడ ఆ ఫెసిలిటీలు లేవు అనే కదా. వాళ్ల రైట్ అది. దాన్ని ఎవ్వరూ తీసేయలేరు. అక్కడ ఓటు వేసి ఉంటే అక్కడ చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటాం అన్నారు చంద్రబాబు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది