Ys Sharmila : కడపలో వీక్ క్యాండిడేట్ ను దింపుతున్న చంద్రబాబు.. షర్మిల కోసమేనా..?
ప్రధానాంశాలు:
Ys Sharmila : కడపలో వీక్ క్యాండిడేట్ ను దింపుతున్న చంద్రబాబు.. షర్మిల కోసమేనా..?
Ys Sharmila : చంద్రబాబు నాయుడు అంటే రాజకీయాల్లో తల పండిన నేత. ఎప్పుడు ఎవరిని దగ్గరకు తీసుకోవాలో.. ఎవరిని దూరం కొట్టాలో.. ఎవరిని దింపాలో.. ఎవరిని అందలం ఎక్కించాలో ఆయనకు బాగా తెలుసు. తనకు అవసరం అనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న నేతను కూడా దగ్గరకు తీసుకుంటారు. అవసరం లేదు అనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా వ్యూహాత్మకంగా పక్కన పెట్టేస్తుంటారు. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూటములుగా ఏర్పడ్డాయి. అయితే ఇటు వైపు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయి.
Ys Sharmila ఎవరికీ తెలియని నేత
అటు కాంగ్రెస్ పార్టీతో వామపక్ష పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. ఇలా అన్ని పార్టీలు కలిసి జగన్ మీద దండయాత్ర చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇది సాహసమే. అయితే ఇప్పుడు టీడీపీ ఎవరిని అక్కడ ఎంపీగా పోటీ చేయిస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో భూపేష్ రెడ్డి పేరుతెరమీదకు వచ్చింది. ఈయన మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. జమ్మలమడుగు టీడీపీ ఇన్ చార్జి. ఈయన జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ కావాలని ప్రయత్నించాడు. కానీ చంద్రబాబు ఇవ్వలేదు.
అక్కడ బీజేపీకి టికెట్ ఇచ్చారు. బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఆదినారాయణ రెడ్డి స్వయానా అన్న కొడుకే భూపేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కొడుకుగా భూపేష్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు. ఇప్పటి వరకు పోటీ చేయలేదు. భూపేశ్ రెడ్డి పెద్ద బలమైన నేత కూడా కాదు. కడపలో పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటి నేతను తెచ్చి ఇప్పుడు చంద్రబాబు కడప ఎంపీగా పోటీ చేయంచడం వ్యూహంలో భాగమే అంటున్నారు. ఎందుకంటే షర్మిల గెలవడం కోసమే భూపేశ్ రెడ్డిని రంగంలోకి దింపారంట చంద్రబాబు. ఎందుకంటే ఒకవేల కడపలో షర్మిల గెలిచి వైసీపీ ఓడిపోతే.. అక్కడ భవిష్యత్ లో టీడీపీ బలపడేందుకు అవకాశాలు ఉంటాయని చంద్రబాబు ప్లాన్ వేశారు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బలహీన మైన క్యాండిడేట్ ను రంగంలోకి దింపారని అంటున్నారు. మరి చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.