మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి ఊహించని షాక్ ఇచ్చిన సీఎం జగన్..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్ వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే. దీంతో వైసీపీ పార్టీ ప్రజా ప్రతినిధులను నాయకులను నిరంతరం జనాల్లో ఉండాలని రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోపక్క ప్రజల నాడిని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నారు. సర్వేల ఆధారంగానే వచ్చే ఎన్నికలలో టికెట్లు ఉంటాయని నాయకులకు ఆల్రెడీ జగన్ క్లారిటీ కూడా ఇవ్వటం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా నిన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాడేపల్లిలో సీఎం జగన్ తో సమావేశం కావడం తెలిసిందే.
ఈ క్రమంలో అనిల్ కు సీఎం జగన్ ఊహించని షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే 151 మంది ఎమ్మెల్యేలలో 18 మంది పనితీరు బాగోలేదని ఇటీవల వర్క్ షాప్ లో సీఎం జగన్ హెచ్చరించడం జరిగింది. అయితే ఆ 18 మందిలో అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఉన్నట్లు దీంతో ప్రత్యేకంగా అతనితో సీఎం జగన్ నిన్న మాట్లాడటం జరిగిందట. నెక్స్ట్ సర్వేలోపు పనితీరు మారకపోతే ఈ రకంగానే వ్యవహరిస్తే టికెట్టు దక్కే అవకాశం లేదని కొద్దిగా హెచ్చరిక చేయడం జరిగినట్టు పార్టీలో టాక్ నడుస్తోంది. 2019 ఎన్నికలలో అనిల్ కుమార్ యాదవ్ గెలుపు కోసం నెల్లూరులో చాలామంది నేతలు కష్టపడటం జరిగింది. అయితే మంత్రి అయినా తర్వాత కేడర్ ని తన దూకుడు కారణంగా దూరం చేసుకోవడంతో ఇప్పుడు వారంతా దగ్గరికి రావడం లేదట.
దీంతో నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్.. పరిస్థితి కాస్త అటు ఇటుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన వాళ్లే అనిల్ కుమార్ యాదవ్ తో పనిచేయడానికి ముందుకు రాని పరిస్థితి జిల్లాలో నెలకొన్నట్లు.. ఈ విషయం పై జగన్ చర్చలు జరిపినట్లు ఇలా అయితే టికెట్ కష్టమని హెచ్చరించినట్లు వార్తలొస్తున్నాయి.