Ys Sharmila : అన్న తోనే పోటీ .. షర్మిలను నమ్ముతారా..? జనంలో సందేహాలు ..!!
ప్రధానాంశాలు:
Ys Sharmila : అన్న తోనే పోటీ .. షర్మిలను నమ్మవచ్చా.. జనంలో సందేహాలు ..!!
Ys Sharmila : ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు హోరాహోరి పోటీ నెలకొంది. వైఎస్ఆర్ సీపీ ఒంటరిగా పోరు చేస్తుంది. టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఇక వై.యస్.షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. దీంతో ఏపీ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల త్వరలోనే రంగంలోకి దిగపోతున్నారు. అయితే ఏపీలో ఆమె టార్గెట్ ఎవరు అంటే సొంత అన్న, అధికార పార్టీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డినే. ఆయనను ఢీ అంటే ఢీ అని వ్యవహరిస్తారని ప్రధాన సంకల్పంతోనే కాంగ్రెస్ పార్టీ ఈమెకు పగ్గాలు అప్పగించింది. హుటాహుటిన ఆరు నెలలు కూడా తిరగకుండానే గిడుగు రుద్రరాజుతో రాజీనామా చేయించి సీటు ఖాళీ చేసి మరి షర్మిలకు ఇచ్చేసింది.
ఇప్పుడు షర్మిల టార్గెట్ అంతా సొంత అన్న జగనే. ఆయనను అధికారం నుంచి తొలగించి కాంగ్రెస్ ఓటు బ్యాంకును సొంతం చేసుకుని, దానిని కాంగ్రెస్ కు మళ్ళించాల్సిన కర్తవ్యం షర్మిలకు ఉంది. అయితే ఇప్పుడు ప్రజలను నమ్మించడం మరో పెద్ద సవాల్. అన్నను ఎదిరించే విషయం పక్కన పెడితే ప్రజలను నమ్మించడం ప్రధాన టాస్క్ గా మారుతుంది. అసలు రాజకీయ రంగ ప్రవేశం చేసిందే వైసీపీ అధినేత సొంత అన్న జగన్ కారణంగా. ఈ విషయాన్ని షర్మిల మర్చిపోయిన ప్రజలు మర్చిపోరు. జగనన్న వదిలిన బాణంగానే తనను తాను పరిచయం చేసుకొని పాదయాత్ర చేసిన షర్మిల గత ఎన్నికల ముందు కూడా అన్న కోసం అలుపెరుగని ప్రయత్నం చేసింది. కాబట్టి జగన్ ను వేరుగా షర్మిలను వేరుగా ప్రజలు భావించలేదు. కానీ ఇప్పుడు ఆమె వేరుపడింది.
దీన్ని ప్రజలు ఎలా నమ్ముతారు. నమ్మించే ప్రయత్నంలో షర్మిల దూకుడు చూపించే అవకాశం ఉండవచ్చు. కానీ నమ్మకం అనేది వైఎస్ తర్వాత. జగన్ కు దఖలు పడిన రాజకీయ ఆస్తి గానే చూస్తున్నారు. పైగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుని నేనున్నానంటూ.. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటూ.. పాదయాత్ర చేపట్టారు. అక్కడ ప్రజల మనసులు దోచుకోవడంలో ఫ్లాప్ అయ్యారు. ఏపీ ప్రజలు ఆ విషయాలను రాజకీయ వాస్తవాలను గుర్తిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆస్తుల విషయంలో ఆగడం చేశారని చెప్పినా ప్రజలు నమ్మే ప్రయత్నం చేయరు. రాజకీయంగా ఆస్తుల పంపకాలు సాధ్యం కాదు. పైగా ఇవి అన్ని కుటుంబాల్లోనూ తరచుగా తెరమీదకి వచ్చేవే. కాబట్టి ఎలా చూసుకున్న ప్రజలను ఒప్పించడం అనే కీలక విషయం షర్మిలకు ఇప్పుడు ప్రధానం అస్త్రంగా మారింది. మరి ఆమె ఏం చేస్తారో చూడాలి. ఏపీలోనైనా ప్రజల మనసులను దోచుకుంటారో లేదో చూడాలి.