Heavy Rains : ఉత్తరాంధ్రకి పొంచి ఉన్న ముప్పు.. భయపడిపోతున్న ఏపీ ప్రజానికం…!
ప్రధానాంశాలు:
Heavy Rains : ఉత్తరాంధ్రకి పొంచి ఉన్న ముప్పు.. భయపడిపోతున్న ఏపీ ప్రజానికం...!
Heavy Rains : ఇటీవల కురుస్తున్న వర్షాలు ఏపీ ప్రజలని భయబ్రాంతులకి గురి చేస్తున్నాయి.తుఫాను ప్రభావంతో చాలా ప్రాంతాలు అల్లకల్లోలం కావడం మనం చూస్తూనే ఉన్నాం.వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఏపీ ప్రజలను మరోమారు భయం గుప్పిట్లోకి నెట్టాయి. రాయలసీమ సహా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. విశాఖ, కాకినాడ తీరాల్లో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న అలలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విశాఖ ఆర్కేబీచ్ వద్ద అలలు భీకర శబ్దంతో దుకాణాల వరకు వచ్చి తాకుతున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో భారీగావర్షాలు కురుస్తునే ఉన్నాయి.
Heavy Rains దూసుకొస్తున్న అల్పపీడనం..
ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తీరం దాటింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 22వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ కోస్తాకు ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా తమిళనాడులో అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. పశ్చిమ దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. రాయలసీమపై అల్పపీడనం కాస్త బలహీనపడినా.. అక్కడే స్థిరంగా ఉంది. అది సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకూ మేఘాలతో ఉంది. అలాగే అక్టోబర్ 22న మరో అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడబోతోంది. ఇది ఒడిశావైపు కదులుతూ.. బలపడే అవకాశం ఉంది అని IMD చెప్పింది.
తాజా పరిస్థితుల వల్ల ఈ వారమంతా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. తుఫాను ప్రభావంతో కోనసీమ జిల్లాతోపాటు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపైనా ఉంటుందని తెలిపింది. రాబోయే 5 రోజుల పాటు తెలంగాణలో వానలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.