ఫామ్ లో ఉన్న వైసీపీ.. పార్టీ నుంచి ఎవరైనా వెళ్తే జగన్ చెప్పే విషయం అదే
ప్రధానాంశాలు:
పోయేవాళ్లను ఆపం
పార్టీకి వ్యతిరేకంగా పని చేసినా ఊరుకోం
23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నాడు
Sajjala Ramakrishna Reddy : ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.. ఈనేపథ్యంలో వైసీపీలో సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వడం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అభ్యర్థుల మార్పు ఉంటే ఉండొచ్చు.. ఏది ఏమైనా వైసీపీ చాలా బలంగా ఉంది. మార్పులు జరుగుతున్నాయని కొందరు నేతలు పక్కకు వెళ్తుంటే.. వాళ్లకు ఒక్కసారి నచ్చజెప్పి చేస్తామన్నారు. ఇక్కడ ఇంతకు మించి ఎదుగుదల లేదని వాళ్లు భ్రమ పడితే వాళ్లకు నచ్చజెబుతాం. కానీ.. కొందరు ఇక్కడ ఇమడలేని వాళ్లు ఉంటారు. వాళ్లు ఖచ్చితంగా పోతారు. వాళ్లను ఆపలేం. ప్రస్తుతం మా పార్టీకి డిమాండ్ ఉంది. ఫామ్ లో ఉన్నాం. 2014 ఎన్నికల తర్వాత 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు అడ్డంగా కొన్నారు. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా పోతే పోనీ కొత్త వారు వస్తారు కదా అనే ఉద్దేశంతోనే జగన్ కూడా చూశారు కానీ.. పోయిన వారి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
వైసీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పేది ఒక్కటే. పార్టీ నుంచి ఎవరైనా వెళ్తే.. దాన్ని బ్రాడ్ మైండ్ తో చూస్తారు తప్పితే వాళ్లపై సీఎం జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదు. వారి ప్రయోజనాల కోసం వెళ్తున్నారు. అందులో తప్పేముంది. కొన్ని చోట్ల అసంతృప్తులు వస్తాయి. నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాం. కానీ.. కొందరు నాయకులు ఇక్కడ ఇమడలేనప్పుడు ఖచ్చితంగా వెళ్లిపోతారు. దాంట్లో ఎలాంటి అనుమానం ఉండదు.. అని సజ్జల అన్నారు.
Sajjala Ramakrishna Reddy : అప్పుడు నలుగురిని సస్పెండ్ చేశాం
ఆ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నలుగురిని సస్పెండ్ చేశాం. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాం. పార్టీ విధానాలు కుదరడం లేదనుకుంటే వాళ్లు వెళ్లిపోతారు. అందులో తప్పేముంది. ఇలాంటి వాళ్ల వల్ల పార్టీకి చాలా నష్టం కలుగుతుంది. అలాంటి వాళ్ల మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అని సజ్జల స్పష్టం చేశారు.