TDP : చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహం…. ఆ నియోజకవర్గం నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి టికెట్‌..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP : చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహం…. ఆ నియోజకవర్గం నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి టికెట్‌..?

TDP : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలలో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలోనే కొత్త కొత్త అభ్యర్థుల పేర్లు తెర పైకి వస్తున్నాయి. పైగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఈ ఎన్నికలు ప్రతి పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమం అని చెప్పాలి. అందుకే ఎలాగైనా సరే అధికారం దక్కించుకోవాలనే తపనతో పార్టీలు ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి […]

 Authored By aruna | The Telugu News | Updated on :23 February 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  TDP : చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహం.... ఆ నియోజకవర్గం నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి టికెట్‌..?

TDP : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలలో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలోనే కొత్త కొత్త అభ్యర్థుల పేర్లు తెర పైకి వస్తున్నాయి. పైగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఈ ఎన్నికలు ప్రతి పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమం అని చెప్పాలి. అందుకే ఎలాగైనా సరే అధికారం దక్కించుకోవాలనే తపనతో పార్టీలు ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి పేరు ఇప్పుడు తెరపైకి వస్తుంది. అయితే మహేష్ బాబు బావ గళ్ళ జయదేవ్ 2014 మరియు 2019 ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా గుంటూరు ఎంపీగాపోటీ చేసి గెలిచిన విషయం మనందరికీ తెలిసింది. కానీ ప్రస్తుతం ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ తరుణంలోనే మహేష్ బాబు బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టీడీపీ పార్టీ నుండి బరిలోకి దిగబోతున్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.

దీనిలో భాగంగానే వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లా పెనుమలూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా ఆదిశేషగిరిరావును దింపేందుకు బాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే నిజానికి ఆదిశేషగిరిరావు ఎప్పటినుండో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2014లో ఆయన వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక ఆ సమయంలో గుంటూరు ఎంపీ టికెట్ ఆశించగా , టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. అదే విధంగా గతంలో కాంగ్రెస్ తో కూడా ఆయన పనిచేశారు.కాగా ఆయనకు పెనుమలూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి మంచి పట్టు ఉందని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో అక్కడ టీడీపీ సీటు కోసం నేతల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది.

ఇప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉండగా మైలవరం నుంచి మాజీ మంత్రి దేవనేని ఉమా ఇక్కడి నుండి పోటీ చేస్తారని ప్రచారాలు సాగుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఆదిశేషగిరి పేరు తెరపైకి రావడంతో రాజకీయ పరిణామాలు అంతుచిక్కనివిగా అర్థమవుతుంది. అయితే టీడీపీ ఆదినాయకత్వం పెనుమలూరు విషయంలో సరికొత్త ఆలోచన చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు బాబాయ్ ఆదిశేషగిరి ని పెనమలూరు నియోజకవర్గం నుండి పోటీ చేపిస్తే మహేష్ బాబు అభిమానులు సపోర్ట్ చేస్తారని ఆశలు చంద్రబాబుకు ఉన్నాయని సమాచారం. ఇక అదే జరిగితే పెనుమలూరు నియోజకవర్గం లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది