New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  New ration cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్..!

New Ration Cards : రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకారం, అర్హులైన కుటుంబాలకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఈ నెలాఖరులోగా ఈకేవైసి (eKYC) ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండగా, ఆ వెంటనే కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని ఆయన తెలిపారు. ఇది కొత్తగా వివాహమైన వారు లేదా కొత్త కుటుంబాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఒక పెద్ద ఊరటగా మారనుంది.

New Ration Cards ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్

New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్..!

New Ration Cards  కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రి నాదెండ్ల మనోహర్ కసరత్తులు

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పోలవరం నిర్వాసితులను కలసి, వారి సమస్యలను సమీక్షించారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతకు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. పాడైపోయిన ఇళ్లకు మరమ్మతులు చేయాలన్న ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందన చూపుతూ త్వరలో చర్యలు తీసుకోనుందని తెలిపారు.

అంతే కాదు ఎఎవై (AAY) కార్డుల రూపంలో ఉచితంగా 35 కేజీల బియ్యం అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. వచ్చే జూన్ నాటికి మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారంతో కూడిన సన్న బియ్యం అందించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కాలనీల్లో తాగునీటి సమస్యలు లేకుండా రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ చర్యలన్నీ పునరావాస కాలనీల్లో ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపడుతున్నారని స్పష్టం చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది