Peddapuram Politics : రసవత్తరంగా పెద్దాపురం రాజకీయాలు.. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ..!
ప్రధానాంశాలు:
Peddapuram Politics : రసవత్తరంగా పెద్దాపురం రాజకీయాలు.. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ..!
Peddapuram Politics : కాకినాడ పెద్దాపురం టీడీపీ రాజకీయం రసవత్తరంగా కొనసాగుతుంది. పార్టీలో కాపు వర్సెస్ కమ్మ అని వ్యవహారం నడుస్తోంది. సెట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప ఇక్కడ రెండోసారి గెలిచారు. ఆయన రాకముందు కమ్మ సామాజిక వర్గానికి చెందిన బొడ్డు భాస్కర రామారావు ఇక్కడ టీడీపీ తరపున రాజకీయం చేసేవారు. 2014 ఎన్నికల ముందు బొడ్డు ఫ్యామిలీ సైకిల్ తొక్కడం కష్టంగా ఉందనుకొని టీడీపీని వదిలేసి వైసీపి లోకి చేరింది. అక్కడ సెట్ అవ్వలేక తిరిగి కొన్నాళ్లకు టీడీపీలోకి చేరారు. అయినా కానీ టీడీపీలో మునుపంతగా యాక్టివ్ కాలేకపోయారు. ఇక భాస్కర రామారావు మరణం తర్వాత ఆయన కుమారుడు వెంకటరమణ చౌదరి పెద్దాపురం పార్టీలో నాయకత్వం తీసుకోవడానికి ప్రయత్నించిన పెద్దగా సక్సెస్ కాలేదు.వచ్చే ఎన్నికల్లో చిన రాజప్ప పోటీ చేస్తారని స్థానిక బహిరంగ సభల్లో ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వెంకటరమణకు రాజానగరం బాధ్యతలను ఇప్పించడంతో వివాదం సద్దుమణిగింది.
అయితే ఈ పెద్దాపురం టికెట్ నాకు కావాలంటూ హడావిడి చేస్తున్నారు గుణ్ణం చంద్రమౌళి. రాజన్న ఫోటో కానీ ఆయన ప్రస్తావన కానీ లేకుండా సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తాను రేస్ లో ఉన్నానని సంకేతాలను పంపుతున్నారు. పార్టీ హై కమాండ్ నేరుగా చెప్పిన పట్టించుకోకుండా చినరాజప్పకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. రాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురం. ఎస్సీ రిజర్వుడ్ కాబట్టి గతంలో ఎమ్మెల్సీగా ఉండేవారు.ఆయన ఆ తర్వాత టీడీపీ అధినాయకత్వం పెద్దాపురం బాధ్యతలను ఆయనకి అప్పగించింది. ఇప్పుడు చంద్రమౌళి వర్గం అదే పాయింట్ మీద నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తుంది. రాజప్పకు ఆరోగ్యం బాగోలేదు కదా ఆయన ఎలా పోటీ చేస్తారు అని గుణ్ణం చంద్రమౌళి సెటైర్లు వేస్తున్నారు. మొదటినుంచి టీడీపీ పెద్దాపురం సీటును కమ్మ సామాజిక వర్గానికి ఇస్తుంది. అదే ఈక్వేషన్ లో అంతకుముందు బొడ్డు వెంకటరమణ చౌదరి ఇప్పుడు గుణ్ణం చంద్రమౌళి సీటును ఆశిస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రి రూరల్ లో కమ్మ సామాజిక వర్గ నేత బుచ్చయ్య ను పక్కన పెట్టారని ప్రచారం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ సీటు అయిన తమ కింద ఉండాలని కమ్మ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆ ఊపుతోనే చంద్రమౌళి రంగంలోకి దిగినట్లుగా ప్రచారం జరుగుతుంది.
అదే సమయంలో చినరాజప్ప కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. పెద్దాపురం పూర్తిగా కాపుల నియోజకవర్గం అని ఇక్కడ ఉన్న మెజారిటీ ఓట్లు తనకు అండగా ఉంటారని ధీమాతో ఉన్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీళ్లంతా వదిలిపోయినా, నేను అంటిపెట్టుకొని ఉన్నాను మధ్యలో ఇప్పుడు వచ్చి సీటు అడిగితే ఎలా ఇస్తారు అని చిన్న రాజప్ప ఎటాక్ చేస్తున్నారు. పార్టీ లైన్ ఎప్పుడు దాటలేదని అవకాశవాదం రాజకీయాలు చేయలేదని చినరాజప్ప గట్టిగానే అంటున్నారట. అవకాశాల కోసం తనకు ఆరోగ్యం బాగోలేదని దీంతో పార్టీ నుంచి తప్పుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా నాన్ లోకల్ ఎలా అవుతానని, హైదరాబాదులో కూర్చుని ఎన్నికల సమయానికి వచ్చి హడావిడి చేస్తున్నవారే నాన్ లోకల్ అని గట్టిగానే రివర్స్ అవుతున్నారట. దీంతో పెద్దాపురం టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది ఇప్పటికైనా పార్టీ హై కమాండ్ జోక్యం చేసుకొని స్పష్టత ఇవ్వాలని క్యాడర్ కోరుతుంది.