land Titling Act : ల్యాంట్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ విష ప్రచారం.. అసలు నిజం ఇదే..!
ప్రధానాంశాలు:
land Titling Act : ల్యాంట్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ విష ప్రచారం.. అసలు నిజం ఇదే..!
land Titling Act : ప్రస్తుతం ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల సమరంలో దాని చుట్టూనే అన్ని పార్టీలు ప్రచారాలు అల్లుతున్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా టీడీపీ, దాని అనుకూల మీడియా మొత్తం ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో జగన్ పేదల భూములు అన్నీ తీసేసుకుంటాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అసలు భూమికి అంతిమ యజమాని ఎవరు అంటే ఇప్పటి వరకు సమాధానం లేదు. దానికి రూపకల్పన చేసేందుకే దీన్ని తెచ్చారు.
land Titling Act : అప్పటి నుంచే ప్రయత్నాలు..
ఈ దేశంలో భూ యాజమాన్య చట్టం తీసుకురావాలని 1989 నుంచే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఇన్నేళ్లకు ఇప్పుడు మోడీ ప్రభుత్వం దానికి రూపకల్పన చేసింది. ఇక 2024 డిసెంబర్ నాటికి దేశంలో అన్ని రాష్ట్రాలు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయాలని డెడ్ లైన్ పెట్టి మరీ కేంద్రం అతి పెద్ద భూ సంస్కరణలను తెచ్చింది. దీని ప్రకారం భూమి మీద అంతిమ హక్కులు యజమానికే కల్పించబోతున్నారు. దీని వల్ల భూమి మీద పూర్తి హక్కులు ఉండటమే కాకుండా అమ్మకాలు, కొనుగోలుకు ఈజీగా ఉంటుంది. ఏపీలో దీన్ని పూర్తిగా అమలు చేయడానికి మరో రెండేళ్లు పడుతుంది. అయితే ఇంత మంచి చట్టాన్ని ఇప్పుడు టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు, టీడీపీ అనుకూల మీడియా అధిపతి సైతం ఈ చట్టం ఎంతో మంచిది, దీని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయంలో దానిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్ మీద బద్నాం మోపడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టీడీపీ కూటమి ఎన్నికల వేళ కేవలం రాజకీయ లబ్ది కోసం విష ప్రచారం చేస్తోంది అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ చట్టం ఎంతో మంచిదని ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న మేథావులు చెబుతున్నారు. అంటే ఒక భూమి మీద ఆ యజమానికి పూర్తి హక్కులు కల్పిస్తున్నప్పుడు జగన్ ఎలా భూములు లాక్కుంటాడు.. ఇంత మంచి చట్టాన్ని తెచ్చి భూములపై పేదలకు హక్కులు కల్పిస్తున్నప్పుడు అసలు హక్కులు లేకుండా పోతాయని చెప్పడంలో ఎంత నిజం ఉందో ఆలోచించాలని కోరుతున్నారు వైసీపీ నేతలు.