YS Rajasekhara Reddy Asti : జగన్ షర్మిల కోసం రాజశేఖర్ రెడ్డి రాసిన వీలునామాలో ఏముంది…? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YS Rajasekhara Reddy Asti : జగన్ షర్మిల కోసం రాజశేఖర్ రెడ్డి రాసిన వీలునామాలో ఏముంది…?

YS Rajasekhara Reddy Asti : 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే కూడా పెద్ద తలకాయ నొప్పిగా మారింది ఎవరు అంటే షర్మిల అని చెప్పాలి. అసలు ఆస్తి గొడవలు రోడ్డు మీద దాకా ఎందుకు వచ్చాయి….?పాలిటిక్స్ ద్వారా షర్మిల తన రివెంత్ తీసుకోబోతుందా…?అసలు వైయస్ రాజశేఖర్ రెడ్డి వీలునామాలో వీరిద్దరి ఆస్తి పంపకం గురించి ఏం రాశారు. అనే విషయాలను […]

 Authored By aruna | The Telugu News | Updated on :7 February 2024,2:00 pm

YS Rajasekhara Reddy Asti : 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే కూడా పెద్ద తలకాయ నొప్పిగా మారింది ఎవరు అంటే షర్మిల అని చెప్పాలి. అసలు ఆస్తి గొడవలు రోడ్డు మీద దాకా ఎందుకు వచ్చాయి….?పాలిటిక్స్ ద్వారా షర్మిల తన రివెంత్ తీసుకోబోతుందా…?అసలు వైయస్ రాజశేఖర్ రెడ్డి వీలునామాలో వీరిద్దరి ఆస్తి పంపకం గురించి ఏం రాశారు. అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వైయస్ షర్మిల యొక్క రాజకీయ ప్రస్థానం బహుశా దేశంలో ప్రపంచంలో కూడా ఎక్కడ చూసి ఉండరు. ఎందుకంటే షర్మిలది చాలా వింతైన రాజకీయ ప్రయాణం అని చెప్పాలి. అయితే షర్మిల రాజకీయ మొదటి అడుగు ఎప్పుడు పడింది అని విషయానికి వస్తే అక్రమ ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు షర్మిల పాదయాత్రతో రాజకీయంలోకి అడుగు పెట్టింది అని చెప్పాలి. ఈ పాదయాత్ర చేయడానికి జగన్ భార్య భారతి రెడ్డిని కూడా పక్కనపెట్టి మా అన్న కోసం నేనే చేస్తాను అంటూ ముందుకు వచ్చి చేసింది. ఈ విషయాన్ని చాలా సార్లు షర్మిల కూడా చెప్పుకొచ్చింది.

వైయస్సార్సీపి పార్టీని నేను నిలబెట్టానంటూ కూడా పలు సందర్భాలలో షర్మిల చెప్పింది. దీంతో చాలామంది షర్మిల వలన వైఎస్ఆర్సిపి పార్టీ నిలబడింది అని ఆలోచనలో పడ్డారు. ఇక దీనిని తిప్పి కొట్టేందుకు వైఎస్ఆర్సిపి కొత్త ఎత్తుగడతో వచ్చిందని చెప్పాలి.ఈ క్రమంలోనే జగన్ జైల్ లో ఉన్నప్పుడు పాదయాత్ర ప్రారంభించాలని చెప్పినప్పుడు తల్లి విజయమ్మ మోకాళ్ళ నొప్పులతో చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు భార్య భారతిని కూడా చేయనివ్వకుండా షర్మిల అడ్డుపడి నేనే చేస్తానంట ముందుకు వచ్చిందని ఇక ఆ సమయంలో ఆమె తన స్వలాభం కోసమే ఆ విధంగా చేసిందంటూ చెప్పుకొస్తున్నారు. ఆనాడు అలా చేయకపోతే షర్మిలకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే షర్మిల పాదయాత్ర చేసినట్లుగా వైసిపి శ్రేణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజల నుండి షర్మిలకు ఒకే ఒక ప్రశ్న ఎదురవుతుందని చెప్పాలి.వైయస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టిన నువ్వు ఎందుకు పార్టీ నుండి బయటకు వచ్చావని ప్రశ్న ఎదురవుతుంది. ఈ క్రమంలోనే ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత నువ్వేం చెప్పిన వింటాం షర్మిల అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు.

అయితే ఎవరు ఎన్నిసార్లు అడిగినా సరే షర్మిల మాత్రం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. ఈ పరంగా చూసినట్లయితే దీని వెనక కచ్చితంగా ఆస్తి గొడవలే ఉన్నాయని దానికోసం ఆమె లీగల్ గా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజశేఖర్ రెడ్డి వీరిద్దరికి సంబంధించి ఆస్తి పంపకాలలో వీలునామ రాసిచ్చారని దానిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు బ్రదర్ అనిల్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదు అంటే ప్రస్తుతం జగన్ పై ఎన్ని కేసులు ఉన్నప్పటికీ సీఎం పదవిలో ఉన్నందున వాటన్నింటినీ చాలా ఈజీగా మేనేజ్ చేస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో ముందు జగన్ ను సీఎం కుర్చీ నుంచి దించి తర్వాత కోర్టును ఆశ్రయించి ఏదైతే వైయస్ రాజశేఖర్ రెడ్డి వీలునామా రాశారో దాన్ని ఆధారంగా వారికి కావాల్సింది రాబట్టుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక