Anaparthy Constituency : అనపర్తి మరో పులివెందులలా అవుతుందా .. ఈసారి గెలుపు ఎవరిది..!
ప్రధానాంశాలు:
Anaparthy Constituency : అనపర్తి మరో పులివెందులలా అవుతుందా .. ఈసారి గెలుపు ఎవరిది..!
Anaparthy Constituency : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని అనపర్తి నియోజకవర్గం రెడ్డిల రాజ్యం అని చెప్పాలి. ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచినా వారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు విజేతలుగా గెలుస్తూ వస్తున్నారు. సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనపర్తి రాజకీయంలో ఐదేళ్లు అధికారం విపక్ష పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధం అంతా ఇంతా కాదు. ఇక టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మధ్య అవినీతి విమర్శలు తారస్థాయికి చేరుకున్నాయి. పెదకూడి, బిక్కవోలు, రంగంపేట, అనపర్తి మండలాల పరిధిలోని ఓటర్లు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తారు. కాంగ్రెస్ అంటే రెడ్డిలు, టీడీపీ అంటే కమ్మ సామాజిక వర్గ లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పార్టీలుగా జనంలో ముద్రపడ్డాయి. కానీ అనపర్తి లో టీడీపీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి కూడా టికెట్లు అందిస్తూ విజయం సాధిస్తూ వచ్చింది.
2014 ఎన్నికల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మీద 1300 ఓట్లు మీద గెలిచారు. రామకృష్ణారెడ్డికి 83 వేల కోట్లు రాగా వైసీపీ అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డికి 82వేల ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో సూర్యనారాయణ రెడ్డికి సానుభూతి బాగా పనిచేసింది. అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వ్యతిరేకత ఉండడంతో గత ఎన్నికల్లో సత్తి సూర్యనారాయణ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే భారీ మెజారిటీతో గెలిచిన సూర్యనారాయణ రెడ్డి పై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అంచనాలను అందుకోవడంలో సూర్యనారాయణ రెడ్డి విఫలమయ్యారని అభిప్రాయం వినిపిస్తుంది. డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు కానీ రాజకీయంగా రాజకీయ నాయకుడుగా గుర్తింపు తెచ్చుకోలేక పోయారని అంటున్నారు.
నియోజకవర్గంలో అభివృద్ధి తక్కువ అవినీతి, అక్రమాలు ఎక్కువ అని ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు. మళ్లీ తన బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. పైగా నల్లమిల్లి ఉన్న మాస్ ఫాలోయింగ్ ఎమ్మెల్యే కి లేదని దీంతో సూర్యనారాయణ రెడ్డికి అనపర్తి లో అనుకూల వాతావరణం తక్కువగా ఉందని, ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు మరో పేరు తెరపైకి రాలేదు. ఇక గతంలో జనసేనకి ఇక్కడ ఓటింగ్ శాతం బాగానే వచ్చింది. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు కాబట్టి అనపర్తి లో టీడీపీ గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.