Y.S.Sharmila VS Kodali Nani : వై.యస్.షర్మిల VS కొడాలి నాని .. మాటకు మాట..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Y.S.Sharmila VS Kodali Nani : వై.యస్.షర్మిల VS కొడాలి నాని .. మాటకు మాట..!

 Authored By aruna | The Telugu News | Updated on :23 January 2024,2:30 pm

ప్రధానాంశాలు:

  •  Y.S.Sharmila VS Kodali Nani : వై.యస్.షర్మిల VS కొడాలి నాని .. మాటకు మాట..!

Y.S.Sharmila VS Kodali Nani : ఏపీలో ఎన్నికల వాతావరణం వాడీ వేడిగా కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒక విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక తాజాగా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వై.యస్.షర్మిల కాంగ్రెస్ చేరికపై కామెంట్స్ చేశారు. ఇక వైయస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే ఆమె మొదటి స్పీచ్ లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే టీడీపీ ప్రభుత్వం పై కూడా ఆమె మండిపడ్డారు. వై.యస్.షర్మిల మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేశారు.

నిరాహార దీక్షలు కూడా చేశారని, ప్రతిపక్షంలో ఉండగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, తెలుగుదేశం పార్టీలో ఎంపీలు మద్దతు ఇవ్వాలని అన్నారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదాను ఎందుకు తీసుకురాలేదని వై.ఎస్.షర్మిల ప్రశ్నించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదని అన్నారు. వైసీపీ స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడానికి గల శాపం వైసీపీ టీడీపీ దే అని అన్నారు. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అన్నారు. ఇక కొడాలి నాని మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ కి ఒకటి శాతం ఓటింగ్ మాత్రమే ఉందని అన్నారు.

గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై వై.యస్.జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచారని అన్నారు. అంత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీపై వై.యస్.జగన్మోహన్ రెడ్డి గెలిచారు ఇప్పుడు ఒకటి శాతం ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పై జగన్మోహన్ రెడ్డి సులువుగా గెలుస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు కి డిపాజిట్లు కూడా రావని అన్నారు. గత ఎన్నికల్లో జనసేన రెండో స్థానంలో, టీడీపీ మూడో స్థానంలో ఉండి డిపాజిట్లు కూడా దక్కించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒకటి శాతం ఓటింగ్ మాత్రమే ఉందని, వై.యస్.షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమీ ఉండదని అన్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది