YS Jagan Mohan Reddy : వైయస్ షర్మిల దూకుడు కి చెక్ పెట్టిన వైయస్ జగన్ .. షాక్ లో బ్రదర్ అనిల్..!
ప్రధానాంశాలు:
YS Jagan Mohan Reddy : వైయస్ షర్మిల దూకుడు కి చెక్ పెట్టిన వైయస్ జగన్ .. షాక్ లో బ్రదర్ అనిల్..!
YS Jagan Mohan Reddy : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైయస్ షర్మిల చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే కాంగ్రెస్ ఏపీలో తనదైన ముద్ర వేసుకుంటుందని కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. అయితే ఇది రాజకీయంగా వై.యస్.జగన్మోహన్ రెడ్డికి ఎంత పెద్ద దెబ్బ తగులుతుంది అనేది చర్చనియాంశమైంది. వైయస్ జగన్ కు వ్యతిరేక ఓట్లు వైయస్ షర్మిల ఎంట్రీ తో చీలిపోతే అది జగన్ కు హెల్ప్ అవుతుంది. అలా కాకుండా వైయస్సార్ ను అభిమానించే వాళ్ళు ఇన్నాళ్లు కాంగ్రెస్ మనుగడ లేక వైయస్సార్ సీపీ ని అభిమానించిన వాళ్లలో చీలిక వస్తే కచ్చితంగా అది వైయస్ జగన్ కు దెబ్బ అవుతుంది. ఇక వైఎస్ షర్మిల దూకుడుని ఆపే ఆలోచనలో వైయస్ జగన్ ఉన్నట్లుగా తెలుస్తుంది.
అంతేకాకుండా బ్రదర్ అనిల్ కు తనదైన శైలిలో వైయస్ జగన్ షాక్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. వైయస్ షర్మిల చేసే ప్రతి కామెంట్ కి వైసీపీ సమాధానం ఇస్తూ వస్తుంది. మొదటి స్పీచ్ లో వైయస్ షర్మిల వైయస్ జగన్ పై చేసిన కామెంట్స్ కి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకి వచ్చి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైయస్ షర్మిల జగన్ రెడ్డి అంటూ పిలవడం, మతం గురించి మాట్లాడడం ఇటువంటి అంశాలను ప్రోత్సహించమని నేరుగా సజ్జల ఓపెన్ గా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైయస్ షర్మిల రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదని, వైఎస్ జగన్ సర్కార్ అభివృద్ధిని చూపించాలని, తనతో పాటు ప్రతిపక్షాలను మేధావులను తీసుకొస్తానని సవాల్ విసిరారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు మా నియోజకవర్గానికి రండి అభివృద్ధి చూపిస్తామని ప్రతి సవాల్ విసిరారు.
అలా కాకుండా ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉంటే వైయస్ షర్మిల కు బలం చేకూరేది. ఇక వై.యస్.షర్మిల ప్రతిపక్షాలను నాతోపాటు తీసుకొస్తా అని అన్నారు. దీంతో ప్రతిపక్షాలన్నీ కుమ్మక్కయ్యాయని తెలుస్తుంది. మొదటినుంచి వైఎస్ జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నానని, ప్రతిపక్షాలన్నీ కుమ్మక్కై వస్తున్నాయని చెబుతున్నద్ వైయస్ షర్మిల అన్నమాటలతో నిజమైంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే చీలుతుంది. ఇది వైయస్ జగన్ కు లాభం అవుతుంది. వైయస్ షర్మిల దూకుడు తనం వైయస్ జగన్ కు కలిసి వస్తుంది. ఇక బ్రదర్ అనిల్ మత పెద్దలతో కలిసి తన భార్యకు సపోర్ట్ చేస్తూ వైయస్ జగన్ క్రిస్టియన్ గా లేరని చెబుతున్నారు. ఇదంతా వైయస్సార్సీపి ముందు జాగ్రత్తగా ఉంటుంది. ఇదంతా వైఎస్ షర్మిలకే దెబ్బ పడుతుంది. వైసీపీ క్యాడర్ అంతా జగన్ వైపు నిలిచారు. దీంతో వైయస్ జగన్ బ్రదర్ అనిల్ కు షాక్ ఇచ్చినట్లు అవుతుంది.