Vijaya Sai Reddy : వైసీపీ క్యాడర్ కి అద్దిరిపోయే ఊపుని ఇచ్చిన విజయసాయి రెడ్డి !
Vijaya Sai Reddy : అసలు ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం పార్టీలు సమాయాత్తం అవుతున్నాయి. అవును.. ఏపీలో వచ్చే సంవత్సరం ఎన్నికలు రానున్నాయి. ఒకేసారి అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో ఇప్పటి నుంచే పథకాలు రచిస్తున్నాయి పార్టీలు. ఏపీలో ప్రధానంగా పోటీలో ఉన్న పార్టీలు అంటే.. అధికార వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అని చెప్పుకోవాలి. అందులో బీజేపీ హవా అయితే అంతగా లేదు కానీ.. ప్రస్తుతం వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉంది వ్యవహారం. వారాహి యాత్రతో జననేన పార్టీకి అనూహ్య స్పందన లభిస్తోంది. అలాగే.. పవన్ కళ్యాణ్ కూడా వైసీపీని టార్గెట్ చేస్తూ వారాహి యాత్రను చేస్తున్నారు. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
అందుకే.. వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా తయారైంది. వైసీపీ కూడా 175 సీట్లకు 175 సీట్లు ఎలా గెలుచుకోవాలా అనే వ్యూహాలు రచిస్తోంది. వై నాట్ 175 అని జగన్ కూడా అంటున్నారు. అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా భారీగానే వ్యూహాలు రచిస్తోంది. నారా లోకేశ్ కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. యువగళం పేరుతో ఆయన రాష్ట్రమంతా నడుస్తున్నారు. ఇలా.. అన్ని పార్టీల వాళ్లు ఎన్నికల కోసం ఇప్పటి నుంచే బిజీ అయిపోయారు.పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఏకంగా వాలంటీర్ల వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ కూడా రివర్స్ కౌంటర్ ఇస్తోంది. వాలంటీర్ల వ్యవస్థ అనేది ఎంతో పారదర్శకంగా నిర్మితమైంది. అంతేకాదు.. ఏపీలోని ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలను తీసుకెళ్లే విధంగా, అసలైన లబ్ధిదారులకే సంక్షేమ ఫలాలు అందేలా వాలంటీర్ల వ్యవస్థ కృషి చేస్తోంది. అలాంటి వాలంటీర్ల వ్యవస్థపై కావాలని విద్వేషపూరిత ప్రచారం చేస్తున్న జనసేన ఆగడాలకు పుల్ స్టాప్ పెట్టడం కోసం వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు.
Vijaya Sai Reddy : రంగంలోకి దిగిన విజయసాయిరెడ్డి
ఆయన త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి వైసీపీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే విజయసాయిరెడ్డి 26 జిల్లాల్లో పర్యటించేందుకు సిద్దమయినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. టీడీపీ అంతు చూస్తానని ఆయన హెచ్చరించారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కాస్త ఉత్సాహం వచ్చింది. ఇక.. జనసేన, టీడీపీ అంతు విజయసాయిరెడ్డి చూసుకుంటారని వైసీపీ నేతలు అంటున్నారు.