Business Idea : ఈ నాలుగు వ్యాపారాలకు… పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ…
Business Idea : ఈ రోజుల్లో చాలామంది సొంత వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. ఒకరి కింద కష్టపడి పనిచేసే బదులు తామే సొంతంగా వ్యాపారం పెట్టి కష్టపడి పనిచేస్తే డబ్బులు మిగులుతాయి కదా అని ఆలోచిస్తుంటారు. అయితే వ్యాపారం ప్రారంభించడానికి లక్షల, కోట్ల రూపాయలు అవసరమని చాలామంది అనుకుంటారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదు. కొన్ని వేల రూపాయలతోనే మీ ఇంట్లోనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ క్రమంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అందించే బిజినెస్ లు ఎన్నో ఉన్నాయి. చాలామంది విద్య మరియు ఉద్యోగాల కోసం సొంత ప్రాంతాలను వదిలి ఇతర నగరాలకు వెళుతుంటారు. అలాంటివారు ఎక్కువగా బయట తినడానికి ఆసక్తి చూపుతారు.
1)అలాంటి వారి కోసం ఆన్లైన్ టిఫిన్ సర్వీస్ బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఈ బిజినెస్ కు ఎక్కువ పెట్టుబడి కూడా ఉండదు. ఇంట్లోనే టిఫిన్ తయారు చేసి మీ సమీప ప్రాంతాల్లోని కస్టమర్లకు డెలివరీ చేసుకోవచ్చు. ఈ వ్యాపారం స్టార్ట్ చేసే ముందు అందరికీ తెలిసేలా కొంచెం పబ్లిసిటీ చేసుకోవడం మంచిది. 2) అలాగే బ్యూటీ పార్లర్ బిజినెస్ కూడా మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం మహిళలే కాదు పురుషులకు కూడా బ్యూటీ పార్లర్ వస్తున్నాయి. మీకు ఈ బిజినెస్ పై ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. కొన్ని మిషన్లు, పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రంగంలో నైపుణ్యం సాధిస్తే మీరు లక్షలు సంపాదించవచ్చు.
3) కప్పులు, టీ షర్టులపై చిత్రాలను ముద్రించి కానుకలుగా అందించడం ఇటీవల విపరీతంగా పెరిగింది. ఈ బిజినెస్ ను మీరు తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్ చేయటానికి ప్రింటింగ్ మిషన్, రంగులు ఖర్చవుతుంది. 4) అలాగే ట్రావెలింగ్ పై పెరుగుతున్న ఆసక్తి ట్రావెల్ పరిశ్రమలు అనేక ఉద్యోగాలను సృష్టించింది ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఇందులో భాగం ట్రావెల్ ఏజెంటు టికెట్ తీసి మొదలై హోటల్ బుకింగ్ వరకు కస్టమర్ల అవసరాలను తీరుస్తారు. ఈ బిజినెస్ ప్రారంభించడానికి పెద్దగా ఖర్చు ఉండదు. ఆదాయం మాత్రం ఎక్కువగా వస్తుంది.