Business Idea : రూ.2 కే దోశ, రూ.3 కే ఇడ్లీ అమ్ముతూ రోజూ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
Business Idea : మనం, ముఖ్యంగా దక్షిణ భారత ప్రజలు దోశ, ఇడ్లీలను ఎక్కువగా తింటారని అందరికీ తెలిసిందే. తమిళనాడులో అయితే వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఏ చిన్న గల్లీకి వెళ్లినా.. ఇడ్లీ, దోశ దొరుకుతుంది. వాటి ధర మనం తినే ప్రదేశాన్ని బట్టీ మారుతుంది. రూ. 20 నుంచి రూ. 200 వరకు అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. కానీ తమిళనాడులోని తిరుచ్చికి చెందిన చిన్నతంబి మాత్రం వీరందరికీ భిన్నంగా తన వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు.కేవలం 2 రూపాయలకే దోశ మరియు రూ. 3 కే ఇడ్లీ అమ్ముతున్నాడు. ఇలా చిన్నతంబి రోజూ 600 నుంచి 800 వరకు దోశెలను అమ్ముతుంటాడు. రాత్రి వేళ ఇడ్లీ, పరోటాతో పాటు ఆమ్లెంట్‌లను కూడా అందిస్తాడు. తమిళనాడులోని వొరైయూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ చిన్న వీధిలో ఉంది చిన్నతంబి హోటల్.
గత ఆరు సంవత్సరాలుగా ప్రతి రోజూ వందలాది మంది వినియోగదారులకు ఆహారం అందిస్తోంది.చిన్నతంబి వంట వాడు.. చాలా సంవత్సరాలు సమీపంలోని రెస్టారెంట్‌లో పని చేశాడు. అలా పనిచేస్తున్న సమయంలోనే సొంతంగా బిజినెస్ పెట్టాలని భావించాడు. తనకు తెలిసిన వంటకు సంబంధించినదే తన మదిలో మొదట వచ్చింది. తాను ప్రారంభించబోయే హోటల్ లో వంటకాల ధరలు పేదవారు కూడా భరించగలిగేలా ఉండాలని ముందే అనుకున్నాడు. అనుకున్నట్లుగా హోటల్ ప్రారంభించి రూ. 2 దోశ అందిస్తున్నాడు. చిన్నతంబి చిన్న దోసెలను రూ.2కు, ఇడ్లీ పొదిపై చల్లి రూ.3కి విక్రయిస్తుంటాడు. అతను ఉల్లిపాయలు మరియు క్యారెట్‌లతో చేసే ఉత్తప్పం అనే ఐటెం ను కేవలం 4 రూపాయలకే అమ్ముతుంటాడు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా దోసెలతో పాటు ఐదు సైడ్ డిష్‌లను కూడా అందిస్తామని అంటున్నాడు చిన్నతంబి.
రెండు కుర్మలు, రెండు చట్నీలు మరియు సాంబార్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని.. అవన్నీ దోసెలతో పాటు ఉచితంగానే ఇస్తామని చెబుతున్నాడు.రోజూ సాయంత్రం 6.30 గంటల నుండి అర్ధరాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉండే అతని దుకాణంలో దోసెలతో పాటు, ఇడ్లీ, పరోటా, వివిధ రకాల వంటకాలు, ఆమ్లెట్ మొదలైన వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి.ఒకప్పుడు స్తోమత లేక ఖాళీ కడుపుతో నిద్ర పోయే వాడినని.. ఆ పరిస్థితి ఏ పేదవారికి రావొద్దనే ఈ దుకాణాన్ని నడుపుతున్నట్లు చెబుతాడు చిన్నతంబి. చిన్నతంబి దుకాణంలో మొత్తం 24 వస్తువులు ఉంటాయి. కానీ రూ.2 దోసెకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. రోజూ తిండిలేక వీధిలో చాలా మంది ఉంటారు.. కానీ రూ.10 నోటుతో నా దుకాణానికి వచ్చి కడుపు నింపుకుని ఆనందంగా వెనుదిరుగుతురాని… అది చాలు తనకు చాలని అంటాడు చిన్నతంబి.