Business Idea : చదివింది 10వ తరగతి… సంపాదన లక్షల్లో… అది ఎలా సాధ్యం అంటే…!
ప్రధానాంశాలు:
Business Idea : చదివింది 10వ తరగతి... సంపాదన లక్షల్లో... అది ఎలా సాధ్యం అంటే...!
Business Idea : ఒక వ్యక్తి పదో తరగతి పూర్తి చేసి నెలకు 50 వేల రూపాయలు పైగా సంపాదిస్తున్నారు అంటే నమ్ముతారా..? . ఎలా అని అనుకుంటున్నారా అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అదిలాబాద్ కు చెందిన మునీర్ హుస్సేన్ మునీర్ దంపతుల ఒకే ఒక్క సంతానం మహమ్మద్ సోయాబ్. పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న సమయంలో తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటుండగా ఉయ్యాల పైనుండి కింద పడడంతో సొయాబ్ వెన్నుముకకు బలమైన గాయమైనది. అయితే మొదట మామూలు దెబ్బనే కదా అని తల్లిదండ్రులు దానిని పట్టించుకోలేదు. యధావిధిగా తనదైన కార్యక్రమాలను కానీంచారు. అయితే మూడు సంవత్సరాల తర్వాత ఆ గాయం మళ్ళీ తీవ్రమైనది. నొప్పితో లేచి నడవలేని పరిస్థితి వచ్చింది. ఇక దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు సోయాబ్ వైద్యం కోసం హైదరాబాద్ నాగపూర్ తీసుకువెళ్లి చూపించారు. హాస్పటల్ లో ని వైద్యులు చికిత్స చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది.
నడుము నుండి కింద భాగం మొత్తం చచ్చు పడిపోయింది. దీనితో సోయాబ్ నడవలేని పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తాను మంచానికే పరిమితం అయిపోయాడు. అటువంటి పరిస్థితి వచ్చిన ఏమాత్రం కుంగి పోకుండా తాను ఏంటో నేర్పించుకోవాలని గట్టిగా సంకల్పించారు సొయాబ్ . తనలో లోపం ఉన్న కుమిలిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోయారు. ఇక ఇప్పుడు వ్యాపార రంగంలో పెద్ద ఏతున్న రాణిస్తున్న యువకుడు అతడు. కుటుంబ సభ్యులు మరియు మిత్రుల తోడ్పాటుతో మూడు చక్రాల బండి పై తన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు మహమ్మద్ సోయాబ్. ఇది ఇలా ఉంటే తన పట్టుదలతో ప్రైవేట్ గా పదవ తరగతి పరీక్ష రాసి పాస్ అయ్యారు. దాని తర్వాత ఇంటర్నెట్ లో వ్యాపార లావాదేవిలపై అవగాహన పెంచుకున్నారు. తన మూడు చక్రాల బండి తో అదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాలలో తిరుగుతూ దుస్తుల వ్యాపారం చేయసాగాడు.
అయితే మధ్యలో కరోన కారణంగా ఆ వ్యాపారం మూత పడిపోయింది. అయిన కూడా పట్టు విడువని ఛత్రపత్తిలా స్నేహితుల సలహాతో కాసి మండలం హస్నాపూర్ గ్రామం వద్ద ఉన్న కోళ్ల ఫారం ను లీజుకు తీసుకొని నాలుగు లక్షల పెట్టుబడితో కోళ్ల వ్యాపారం ప్రారంభించారు. అయితే వ్యాపారం మొదట కొంత ఇబ్బంది వచ్చిందట . అయినా సరే దానిని ఎదుర్కొని వ్యాపారం నడిచేలా చేశాడు. ఖర్చులు పోను నెలకు కనీసం 50 వేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక తన వ్యాపారంలో తన ఉపాధితో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు మహమ్మద్ సోయాబ్. అలాంటి సొయాబ్ పట్టుదల ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతున్న చాలామంది ఆదర్శం అని చెప్పాలి.