Chittor.. నాలుగు కిలోమీటర్ల పాటు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం..
రోజురోజుకూ కాలుష్యం బాగా పెరిగిపోతుండటం, అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండటం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు చెట్ల పరిరక్షణకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. సెలబ్రిటీలు సైతం మొక్కల పెంపకం వాటి ఆవశ్యకత గురించి తెలుపుతూ మొక్కలు నాటుతున్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నారు. ఏపీ సర్కారు ‘జగనన్న పచ్చతోరణం’ పేరిట మొక్కలను నాటుతున్నది. ఆదివారం శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రేణిగుంట మండలం గాజులమండ్యం, అత్తురు పంచాయతీలో ఈ […]
రోజురోజుకూ కాలుష్యం బాగా పెరిగిపోతుండటం, అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండటం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు చెట్ల పరిరక్షణకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. సెలబ్రిటీలు సైతం మొక్కల పెంపకం వాటి ఆవశ్యకత గురించి తెలుపుతూ మొక్కలు నాటుతున్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నారు. ఏపీ సర్కారు ‘జగనన్న పచ్చతోరణం’ పేరిట మొక్కలను నాటుతున్నది. ఆదివారం శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
రేణిగుంట మండలం గాజులమండ్యం, అత్తురు పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్తురు పంచాయతీ పరిధిలో నాలుగున్నర కిలోమీటర్ల మేర దాదాపు 1,800 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. జగన్ నాయకత్వంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బియ్యపు వెంట ఎంపీడీఓ, తహసీల్దార్, ఏపీఓలు, మండల స్థాయి అధికారులు ఉన్నారు.