Garuda Puranam : లోకంలో ప్రతి జీవికి ఈ 6 విషయాలు జన్మించక ముందే నిర్ణయించబడతాయి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Garuda Puranam : లోకంలో ప్రతి జీవికి ఈ 6 విషయాలు జన్మించక ముందే నిర్ణయించబడతాయి..!

Garuda Puranam : భూమ్మీద జన్మించే ప్రతి మనిషి తలరాతనేది అతడు పూర్వ జన్మలో చేసిన కర్మలను అనుసరించి ముందే లెక్కించబడి ఉంటుంది. ఒక వ్యక్తి గర్భంలోకి ప్రవేశించడం దగ్గర నుంచి అతడు మరణించే వరకు ప్రతి దాని వెనుక కర్మఫలం అనేది కచ్చితంగా ఉంటుంది. గత జన్మలో చేసిన పాపం పుణ్యాల ఫలాన్ని అదే జన్మలో అనుభవించుగా మిగిలిన కర్మ ఫలాన్ని ఆ జీవుడు మరో జన్మను అనుభవించాల్సి ఉంటుంది. అది పాప పైన కావచ్చు.. […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 February 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Garuda Puranam : లోకంలో ప్రతి జీవికి ఈ 6 విషయాలు జన్మించక ముందే నిర్ణయించబడతాయి..!

Garuda Puranam : భూమ్మీద జన్మించే ప్రతి మనిషి తలరాతనేది అతడు పూర్వ జన్మలో చేసిన కర్మలను అనుసరించి ముందే లెక్కించబడి ఉంటుంది. ఒక వ్యక్తి గర్భంలోకి ప్రవేశించడం దగ్గర నుంచి అతడు మరణించే వరకు ప్రతి దాని వెనుక కర్మఫలం అనేది కచ్చితంగా ఉంటుంది. గత జన్మలో చేసిన పాపం పుణ్యాల ఫలాన్ని అదే జన్మలో అనుభవించుగా మిగిలిన కర్మ ఫలాన్ని ఆ జీవుడు మరో జన్మను అనుభవించాల్సి ఉంటుంది. అది పాప పైన కావచ్చు.. పుణ్యమైనా కావచ్చు.. ఆ కర్మఫలం ఆధారంగానే విధి రాత అనేది వ్రాయబడి ఉంటుంది. మనిషి జన్మించక ముందే ఈ ఆరు విషయాలు ముందే నిర్మించబడతాయి. వీటిని భూమి మీదకు వచ్చాక మార్చుకోవడం అనేది కుదరని పని మరి ఆ ఆరు విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టుక మానవుని జన్మ ఎక్కడ ఏ విధంగా జరగాలి. ఎవరు కడుపున ఎలా పుట్టాలి అనేది గర్భంలోనికి ప్రవేశించక ముందే నిర్ణయించబడి ఉంటుంది.

అతడు గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగా ఈ జన్మలో ఎక్కడ ఎవరికి ఏ ఇంట్లో పుట్టాలి అనేది విధాత నిర్ణయిస్తారు. దీనిని ఎవరు మార్చలేరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది ధనవంతుల ఇంట్లో వారి పిల్లలు బుద్ధి విహీనంతోనూ అంగవైకల్యంతోనో పుడుతూ ఉంటారు. ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్న ఏది వారు అనుభవించలేరు వారు గత జన్మలో చేసిన పాపపు కర్మలకు ఫలితంగా వారు ఈ జన్మలో ఇలా జన్మించవలసి వచ్చింది. అది కర్మఫలం అంటే దీనిని ఎవరు మార్చలేరు. ఇక రెండవది అతడు ఎంత బుద్ధిమంతుడు జ్ఞానంతో ఉండాలి అనేది ముందుగానే లిఖించబడి ఉంటుంది. ఒక గురువు తన శిష్యులు అందరికీ ఒకే విధంగానే జ్ఞానాన్ని పంచుతాడు. వారిలో ఒకరు మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగ సంపాదిస్తే మరొకరు మాత్రం మందమతి గానే ఉంటూ చెడు సహవాసాలకు అలవాటు పడి అందరిచేత చేదరించుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తిత్వం జ్ఞానం అనేది అతడు గత జన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడి ఉంటాయి. ఇక మూడవది మన వివాహం ఎప్పుడు ఎలా ఎవరితో జరగాలి. అనేది ఆ విధాత ముందే నిర్ణయిస్తాడు.

అతని తలరాత ఆధారంగానే ఎటువంటి జీవిత భాగస్వామి అతని జీవితంలోకి రావాలి. ముందుగానే ఫిక్స్ చేసి ఉంటుంది దీనిని ఎవరు తప్పించలేరు. నాలుగవది అతని వద్ద ఎంత ధనం ఉండాలి ఆ వ్యక్తి ధనవంతుడిగా ఉండాలా లేక పేదవాడిగా ఉండాలని అతడు పూర్వజన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడి ఉంటుంది. కొంతమందికి ఎంత కష్టపడినా ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసిన వస్తే ఉంటారు. ఇదంతా కర్మఫలం అనుసరించే జరుగుతూ ఉంటుంది. ఇక ఐదవది మానవుడు మరణం అనేది ఎప్పుడూ ఎలా ఏ విధంగా సంభవిస్తుంది అనే విషయం ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. అతడు రోగాల బారిన పడి బాధపడుతూ మరణించాల లేక హాయిగా సహజ మరణం పొందాల.. లేక ప్రమాదం బారిన పడి మృతి ఒడిలోకి చేరాలా అనేది ఆ వ్యక్తి గత జన్మలో చేసిన కర్మలను బట్టి నిర్ణయించబడి ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది