Ayodhya Ram Mandir : అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట రోజు ఈ 8 పనులు ఖచ్చితంగా చేయాలి..?
ప్రధానాంశాలు:
Ayodhya Ram Mandir : అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట రోజు ఈ 8 పనులు ఖచ్చితంగా చేయాలి..?
Ayodhya Ram Mandir : అయోధ్యలో ఈరోజు రామ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది.. దేశవ్యాప్తంగా రామ జపమే వినిపిస్తోంది. 22వ తేదీన జరిగే ఘన వేడుక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు..
ఈ రామ మందిరం కోసం ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు వచ్చిన కూడా రామ మందిరం నిర్మాణ కళ కొన్ని గంటలలో నెరవేరబోతుంది. అయోధ్య రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట జనవరి 22వ తేదీన అత్యంత వైభవంగా జరగనున్నది.. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలంతా రామ నామ జపంతో ఉండాలని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు..
అయితే రామ ప్రాణ ప్రతిష్ట నాడు మనం ఎటువంటి పనులు చేయాలో తెలుసుకుందాం…
1) మీ దగ్గర దేవాలయంలో కూడా ఉదయం 10 గంటలనుండి 11 గంటల వరకు రామ భజనలతోపాటు సంకీర్తనలు చేసేలా ప్రోత్సహించాలి. 11 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు అయోధ్యలో రామ బాలుడి ప్రాణ ప్రతిష్ట నిర్వహించనున్నారు. కావున దాన్ని తప్పనిసరిగా అందరూ వీక్షించాలి..
2) రామ ప్రాణ ప్రతిష్ట నాడు కాలనీలు, బస్తీలు, గ్రామాలు పచ్చని తోరణాలతో అలంకరించుకోవాలి. రామాలయాలను కూడా శుభ్రం చేసి పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించాలి..
3) ఈ నిర్మాణం ఐదు శతాబ్దాల కావున 5 దీపాలు వెలిగించుకోవాలి..
4) ప్రతి ఇంటిపై కాషాయ జెండాను ఎగరవేయాలి..
5) ఇక బాలరాముడు ప్రతిష్ట అయిన తరువాత ప్రతి ఇంటికి వచ్చినటువంటి అక్షింతలను మీ పై మీ కుటుంబ సభ్యులపై చల్లుకొని పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి..
6) రామ ప్రాణ ప్రతిష్ట సమయంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోవాలి..
7) ప్రతి ఇంట్లోనూ రాముని ప్రతిమకు పూజలు జరగాలి..
8) ఈ విధంగా చేయడం వలన ఆ అయోధ్య రాముని అనుగ్రహం తప్పక కలిగి అన్ని శుభాలే జరుగుతాయి అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు…
కావున ఈరోజు రాముని ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో రామ కీర్తనలతో రామ జపాలతో పండగలా జరుపుకోవాలి…