Chanakya Niti : నూతన సంవత్సరంలో ఈ డెసిషన్స్ తీసుకుంటే మీ లైఫ్ ఫుల్లీ సక్సెస్ ఫుల్.. గ్యారెంటీ..
Chanakya Niti : 2021వ సంవత్సరం గడిచిపోతున్నది. చరిత్ర పుటలో ఈ ఏడాది ఇక చేరిపోనుంది. కొత్త సంవత్సరం రాబోతున్నది. దాని కోసం కొంగొత్త ఆశలతో ఎదురు చూడాలి. ఈ క్రమంలోనే చాలా మంది వచ్చే ఏడాది అది చేయాలి, ఇది చేయాలి, అని చాలా రకాల రిజల్యూషన్స్ గురించి ఆలోచనలు చేస్తుంటారు. ఆ రిజల్యూషన్స్ ఆచరణలోకి వస్తాయా రావా అనేది కూడా ఇంపార్టెంట్. కాగా, గ్రేట్ ఇండియన్ టీచర్ ఆచార్య చాణక్య చెప్పినట్లు ఈ నాలుగు నిర్ణయాలు తీసుకుంటే కనుక జీవితం కచ్చితంగా విజయవంతమవుతుంది. ఆ నిర్ణయాలు ఏంటంటే.. కొత్త సంవత్సరంలో కొత్త కొత్త లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగాలని పెద్దలు చెప్తుంటారు.
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు చెప్పిన గొప్ప నియమాలివే..
అది నిజమే. కానీ, అలా లక్ష్యాలను నిర్దేశించుకునే క్రమంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అనగా ఆచరణలో అది సాధ్యమయ్యేనా లేదా అనేది కూడా ఆలోచించాలి. ఈ సంగతులు అలా ఉంచితే.. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలను పాటిస్తే కనుక కంపల్సరీగా లైఫ్‌లో సక్సెస్ అవుతారు. కోపం, అహంకారాన్ని వదిలేయాలి. ఇవి రెండిటినీ వదిలేస్తే తప్పకుండా జీవితంలో మనం అనుకున్న పని కంపల్సరీగా సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేయవచ్చు. మనిషి ఎదుగుదలకు కోపం, అహంకారం శత్రువులు కాబట్టి..వాటిని వదిలేయాలి. కపోతే మనం ఏ పని చేసినా ఎవరో ఒకరు మనలను విమర్శిస్తుంటారు.
ఇ ఈ నేపథ్యంలో విమర్శలను అస్సలు పట్టించుకోవద్దు. మీరు చేస్తున్నది సరైనదని మీకు అనిపిస్తే అంతే.. ఇక ముందుకు సాగాల్సిందే.. లక్ష్యంపైన ఫోకస్ పెట్టి విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగాలి. ఇకపోతే చేసిన తప్పులను మళ్లీ అస్సలు చేయొద్దు. తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. శ్రమ చేసేందుకు అస్సలు భయపడొద్దు. శ్రమయేవ జయతే.. అన్న విషయం గుర్తుంచుకుని ముందుకు సాగాలి. లక్ష్య సాధన కోసం కష్టపడి పని చేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ లక్ష్యం పక్కనబెట్టకూడదు.. ఈ నిర్ణయాలను కొత్త సంవత్సరం తీసుకుని ముందుకు సాగితే జీవితంలో తప్పకుండా సక్సెస్ అవుతారు.