Lord Shiva : సంతానం లేని వారు, పెళ్లి కాని వారు శివుడికి వీటితో అభిషేకం చేయండి ఇలా…
Lord Shiva : ఈ శ్రావణ మాసంలో శివుని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఆయనకి ఎన్నో అభిషేకాలను చేస్తూ ఉంటారు. కానీ సంతానం లేని వారు, పెళ్లి కాని వారు ఈ విధంగా శివునికి అభిషేకం చేసినట్లయితే తప్పక ఆ శివుని అనుగ్రహం కలుగుతుంది. శివునికి ఎలాంటి అభిషేకం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. 1) ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్యాలు కలుగుతాయి. 2) ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను అందజేయను. 3) నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృతువు నశించుతుంది. 4) పెరుగుతో ఆ శివున్ని అభిషేకించినట్లయితే ఆరోగ్యము, యశస్సు, బలము పొందుతారు. 5) అదేవిధంగా గరిక నీటితో శివున్ని అభిషేకించినట్లయితే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. 6) మారేడు బిల్వదల జలముతో శివున్ని అభిషేకించినట్లయితే భోగభాగ్యములను పొందుతారు. 7) చెరుకు రసంతో శివున్ని అభిషేకించినట్లయితే ధన ప్రాప్తి కలుగును. 8) చక్కెరతో శివున్ని అభిషేకించినట్లయితే దుఃఖము నాశనము అవ్వగలను.
9) స్వచ్ఛమైన కొబ్బరి నీటితో అభిషేకించినట్లయితే సకల సంపదలను పొందుతారు. 10) తేనెతో శివుడిని అభిషేకించినట్లయితే తేజోవృద్ధి పొందుతారు. 11) పుష్పములు తో అభిషేకించినట్లయితే భూమి యొక్క లాభము పొందుతారు. 12) భీష్మభిషేకంచె చేసినట్లయితే సకల పాపములను తొలగిపోవును. 13) రుద్రాక్ష జలాభిషేకమును చేసినట్లయితే అష్ట ఐశ్వర్యాలను పొందుతారు. 14) బంగారపు నీటితో శివున్ని అభిషేకించినట్లయితే దరిద్రము నశించును. 15) గంధంతో శివున్ని అభిషేకించినట్లయితే సపుత్ర ప్రాప్తి పొందుతారు. 16) ద్రాక్ష రసముతో శివుని అభిషేకించిన మొదలుపెట్టిన ప్రతి దాంట్లో అన్ని విజయాలనే పొందుతారు. 17) నీటితో అభిషేకించినట్లయితే ఏమైనా నష్టపోయి ఉంటే అవి మళ్లీ తిరిగి లభించును. 18) ఖర్జూర రసముతో శివున్ని అభిషేకించినట్లయితే శత్రువుల నుండి హరింప చేస్తుంది.
19) కస్తూరి కలిపిన నీటిచ్చి అభిషేకించినట్లయితే చక్రవర్తము పొందుతారు. 20) నేరేడు పళ్ళ రసముతో శివున్ని అభిషేకించినట్లయితే వైరాగ్య సిద్ధి పొందుతారు. 21) మామిడి పండ్ల రసముతో అభిషేకించినట్లయితే దీర్ఘ కాలపు వ్యాధులు తొలుగును. 22) పసుపు నీటితో అభిషేకించినట్లయితే మంగళ ప్రదము అగును, శుభకార్యములు జరగగలవు. 23) నవరత్నతో డెకముచే శివున్ని అభిషేకించినట్లయితే ధ్యానము, గృహ ,గోవృద్దిని పొందగలరు. 24) అన్నముతో శివుడిని అభిషేకించినట్లయితే అధికార ప్రాప్తి అలాగే మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివ పూజలలో అన్న లింగార్చనకు ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. పెరుగు కలిపిన అన్నముతో శివుని లింగానికి మొత్తం మేత్తి పూజ చేయాలి. ఆ మెత్తిన అన్నాన్ని అర్చన అయిపోయిన తర్వాత దానిని ప్రసాదముగా అందరికీ పంచి పెట్టాలి. అది చూడడానికి ఎంతో చాలా బాగుంటుంది.