Ganesha idol : ఇంట్లో పెట్టుకునే వినాయకుడి విగ్రహానికి తొండం ఏ దిశలో ఉండాలో తెలుసా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ganesha idol : ఇంట్లో పెట్టుకునే వినాయకుడి విగ్రహానికి తొండం ఏ దిశలో ఉండాలో తెలుసా..!

 Authored By aruna | The Telugu News | Updated on :17 September 2023,11:00 am

Ganesha idol : వినాయక చవితి పండుగకి ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది. హిందువులు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీధులలో పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసుకొని నిమజ్జనం వరకు ఎంతో ఎంతో వైభవంగా పూజలు చేస్తూ చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అలాగే చాలామంది తమ ఇళ్లల్లో కూడా వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకొని పూజలు కూడా చేస్తారు. అయితే ఇంటికి తెచ్చుకునే వినాయకుడి తొండం కూడా ఎంతో ముఖ్యమైనదని పండితులు చెబుతున్నారు. వినాయకుడి విగ్రహానికి కొన్ని వాస్తు నియమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వినాయకుడి తొండం సరైన దిశలో ఉండడానికి ఇది అవసరమని భావిస్తారు.

గణపతి పూజ కోసం ఆయన విగ్రహాన్ని కొన్నప్పుడు విగ్రహం ఎంత బాగుంది అని అందరూ చూస్తూ ఉంటారు. కానీ చాలామంది తొండం గురించి అంతగా పట్టించుకోరు. వాస్తు ప్రకారం గణపతి ఎంతో పవిత్రమైనదిగా పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గణేశుడు శరీర భాగాలు జీవితంలోని విభిన్న విషయాలను తెలియజేస్తాయి. ఉదాహరణకు పెద్ద ఏనుగు తల తెలివితేటలు, జ్ఞానం, జీవితంలోని సమస్యలను ఎదుర్కొనే శక్తిని సూచిస్తుంది. గణపతి తొండం అన్ని ప్రాపంచిక సమస్యలను నిర్వహించడానికి అనుకూలత సామర్థ్యాన్ని సూచిస్తుంది. వినాయకుడి తొండం ఎప్పుడు తన తల్లి గౌరీదేవి వైపు ఉండాలి అంటే ఎడమవైపుకి ఉండాలని పండితులు చెబుతున్నారు. గణపతి తొండం దిశకు సంబంధించిన అనేక నమ్మకాలు ప్రజలలో ఉన్నాయి.

Do you know in which direction the head of the Ganesha idol placed at home

Do you know in which direction the head of the Ganesha idol placed at home

చంద్రుని దిశలో ఉన్నందున తొండం ఎడమవైపుకు తిరిగిన వినాయకుడి విగ్రహాలు సాధారణంగా ప్రశాంతంగా ఉంటాయని చాలామంది నమ్ముతారు. ఈ విగ్రహానికి శక్తి ప్రవాహానికి ప్రసిద్ధి చెంది ఉంటుంది. ఈ కారణంగా వినాయకుడి విగ్రహం ఎడమవైపుకు ఉండడం వలన పూజకు శుభప్రదంగా భావిస్తారు. కుడివైపుకు తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహాలు మరింత శక్తివంతమైనవిగా పరిగణిస్తారు. అందువలన తొండం కుడి వైపుకు తిరిగి ఉన్న విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదని చెబుతారు. కుడివైపు తొండం ఉన్న గణపతి చాలా మొండిగా ఉంటాడని చెబుతున్నారు. అతని పూజలో చిన్న దోషం ఉన్నా కూడా అంగీకరించరు. కాబట్టి అలాంటి విగ్రహాన్ని ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది