Garuda puranam : ఈ జీవితంలో ఈ తప్పులు చేశారంటే… మీ పాపం డబుల్ అవుతుంది.. కర్మఫలం తప్పించుకోలేరు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Garuda puranam : ఈ జీవితంలో ఈ తప్పులు చేశారంటే… మీ పాపం డబుల్ అవుతుంది.. కర్మఫలం తప్పించుకోలేరు…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 March 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Garuda puranam : ఈ జీవితంలో ఈ తప్పులు చేశారంటే... మీ పాపం డబుల్ అవుతుంది.. కర్మఫలం తప్పించుకోలేరు...?

Garuda Puranam : నిత్యం మన జీవితంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. వాటి వలన కర్మ ఫలాలను అనుభవించవలసి వస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. దానికి తగిన శిక్ష తప్పదు. అయితే, పాప పుణ్యాల గురించి గరుడ పురాణంలో ఏం చెప్పబడింది అనే విషయం తెలుసుకుందాం… పురాణంలో మన జీవితం, మరణం, పాపం, ధర్మం గురించి స్పష్టంగా వివరించబడింది. కొన్ని విషయాలు ప్రస్తావించినా కొన్ని పనులు మన ఆత్మకు త్రీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని చెబుతారు. ముఖ్యంగా, ఇటువంటి తప్పులను చేసినట్లయితే త్రీవ్రమైన శిక్షలకు దారితీస్తాయని ఈ గ్రంథం స్పష్టంగా తెలియజేసింది.

Garuda puranam ఈ జీవితంలో ఈ తప్పులు చేశారంటే మీ పాపం డబుల్ అవుతుంది కర్మఫలం తప్పించుకోలేరు

Garuda puranam : ఈ జీవితంలో ఈ తప్పులు చేశారంటే… మీ పాపం డబుల్ అవుతుంది.. కర్మఫలం తప్పించుకోలేరు…?

Garuda puranam గరుడ పురాణం

గరుడ పురాణం గ్రంథంలో జీవితం, మరణం, ధర్మం, పాపం గురించి వివరణ ఆత్మకమైన బోధనను అందిస్తుంది. ఇందులో ప్రస్తావించిన పాపాలు మనిషి ఆత్మకు హాని కలిగించే దారుణమైన చర్యలు. ఆపాలు చేయకుండా ధర్మాన్ని అనుసరించడం ద్వారా జీవితంలో పవిత్రంగా ఉండి సంతోషాన్ని పొందవచ్చు అని గరుడ పురాణంలో చెప్పబడింది.

బ్రాహ్మణ హత్య : పురాణంలో బ్రాహ్మణ హత్యను అతిపెద్ద పాపంగా పరిగణించబడింది. బ్రాహ్మణులు, జ్ఞానానికి ధర్మానికి ప్రతికలు. వంటి వీరిని హింసించడం వల్ల ఆత్మపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. బ్రాహ్మణ హత్య అత్యంత ఘోరమైన పాపంగా గరుడ పురాణంలో చెప్పడం జరిగింది.

గోవధ : గరుడ పురాణంలో ఆవును తల్లితో సమానంగా చూస్తారు. వంటి గోవధను కూడా అత్యంత ప్రాణాంతకమైన పాపంగా చెప్పబడింది. పూజించే ఆవును హతమార్చడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల దుష్ఫలితాలు ఉంటాయి. దైవ సంబంధిత ఆవుని హతమార్చడం దారుణమైన పాపమని గ్రంథంలో పేర్కొన్నారు.

తల్లిదండ్రుల గౌరవం :  జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించకపోవడం గరుడ పురాణం ప్రకారం పెద్ద పాపం. తల్లిదండ్రులు దేవతల కంటే తక్కువ ఏమి కాదు. వారిని అవమానించిన లేదా వారి సేవ చేయకపోయినా జీవితంలో అత్యంత పాపము గా పరిగణించబడినది.

దోపిడి : ధనం కోసం ఒకరి సోమ్ముని దోచుకోవడం కూడా పెద్ద పాపమే. ఒకరి ఆస్తిని దుర్వినియోగం చేయడం లేదా వారి సంపదను అపహరించడం గరుడ పురాణం ప్రకారం ఆత్మకు హానికరం అని చెప్పబడింది. దోపిడీ చేసేవారు భవిష్యత్తులో పాపాలను అనుభవిస్తారు.

వృద్ధుల గౌరవం : వృద్ధులను గౌరవించకపోవడం గరుడ పురాణం ప్రకారం మరో పెద్ద పాపం. వృద్ధులను అగౌరవపరిస్తే మానవతా విలువలు తక్కువగా ఉంటాయి. ముద్దులు అనుభవజ్ఞులు. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించినట్లయితే అనేక రకాల దుష్ఫలితాలను కలిగిస్తుంది.

శరీర పరిశుభ్రత : మీ శరీరమును అపరిశుభ్రంగా ఉంచుకోవడం వలన కూడా గరుడ పురాణంలో పాపంగా పరిగణించబడింది. తీరిక పరిశుభ్రత అనేది మన ఆత్మకు స్వచ్ఛతను ఇస్తుంది. ఇంటి పరిశుభ్రత లేకపోతే పాప ఫలితాలు ఉంటాయని పురాణం పేర్కొంది.

సంపద, ధర్మ మార్గం : పురాణంలో సంపదను సక్రమంగా వాడుకపోవడం, ధర్మ మార్గం నుంచి దారి తప్పడం పాపకార్యాలుగా చెప్పబడింది. మనిషి సంపాదించే సంపాదన అక్రమ మార్గాలలో సంపాదిచడం. ధర్మాన్ని విడిచిపెట్టడం వల్ల జీవితంలో శిక్షలు ఎదురవుతాయని గరుడ పురాణంలో చెప్పబడింది. పాపాలన్నీ కూడా ఆత్మకు హానిచేస్తాయి. పురాణంలో నిజమైన ధర్మం కి సంబంధించిన మార్గాన్ని అనుసరించడం ద్వారా మన ఆత్మ స్వచ్చంగా ఉంటుంది. లో చేసిన పాపాలకు కర్మఫలం తప్పదు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది