Vaidyanatha Jyotirlingam Temple : ఆరోగ్య ప్రదాత… వైద్యనాథ జ్యోతిర్లింగం !
Vaidyanatha Jyotirlingam Temple : జ్యోతిర్లింగాలలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిలో వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం..
భిన్నాభిప్రాయాలు :Vaidyanatha Jyotirlingam Temple
వైద్యనాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేదాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్ర పర్లీ గామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని, గణా ఖేడలోని లింగం, పంజాబ్ కీరాగ్రామంలోని లింగం, హిమాచల్ ప్రదేశ్ లోని పఠాన్ కోట్ కు సమీపంలో లింగం, కర్ణాటకలోని గోకర్ణ లింగం…ఇవన్నీ శివుని ఆత్మలింగాలేనన్న వాదన బలంగా ఉంది. అయితే జార్ఘండ్ వైద్యనాథం లో వెలసినదే అసలైన జ్యోతిర్లింగమని విజ్ఞుల వాదన.
పురాణగాథ :Vaidyanatha Jyotirlingam Temple
పురాణగాథ ప్రకారం … పూర్వం రావణాసురుడు కఠోరా నియమాలతో, ఒక చేట్టుకుండా అగ్ని గుండాన్ని ఏర్పరచి, పార్థివలింగాన్ని ప్రతిష్టించి, శివపంచాక్షరీ మంత్రంతో, హవాన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా, శివుడు రావుణుడు కోరికననుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ లింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే స్థిరపడుతుందని హెచ్చరించాడు. ఆత్మలింగంతో లంకానగారానికి తిరుగు ప్రయాణమైన రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఒక పశువుల కాపరికి (దేవతల కోరికపై వినాయకుడు ఈ వేషాన్ని ధరించాడు) లింగాన్ని ఇవ్వగా, ఆ కాపరి ఆత్మలింగాన్ని కిందపెడతాడు. ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడిపోతుంది. రావణుడు ఎంతగా ఆ ఆత్మలింగాన్ని పెకలించి లంకా నగారానికి తీసుకెళదామని ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు.
విశేషాలు :
వైద్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది. కానీ, ఈ ఆలయ మందిర శిఖరంపై పంచాశూలం ఉంది. మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇలాంటి అమరిక లేదు. పంచాక్షరీమంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు దీనిలో శివతత్వం అంతర్లీనంగా ఉంటుంది.
ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి రవాణా సౌకర్యం ఉంది.
ఫోటులు వైద్యనాథ జ్యోతిర్లింగం ఫోటులు వాడగలరు