దితెలుగున్యూస్ వెబ్ సైట్ సర్వే పోల్‌.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

దితెలుగున్యూస్ వెబ్ సైట్ సర్వే పోల్‌.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు?

 Authored By aruna | The Telugu News | Updated on :16 November 2023,9:47 pm

ప్రధానాంశాలు:

  •  దితెలుగున్యూస్ వెబ్ సైట్ సర్వే పోల్‌..

  •   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు?

  •  ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

Telangana Assembly Election 2023 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం ఆరంభమైంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణను ఒక్క పార్టీయే రూల్ చేసింది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఒక్క చాన్స్ అంటూ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్లోకి వెళ్తోంది. ఇక.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ ఒక్కసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చి సౌత్ ఇండియాలో మళ్లీ పార్టీని విస్తరించుకోవాలని చూస్తోంది.

ఎటు చూసినా ఈసారి ఎన్నికలు మూడు పార్టీలకు చాలా ముఖ్యమైనవి. మరోవైపు ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలన్నీ అమలు సాధ్యం కాని హామీలను కూడా ప్రకటించాయి. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఎవరి వైపు ఉంటారు.. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చి తెలంగాణను అభివృద్ధి చేశాం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ కు పట్టం కడతారా? లేక తెలంగాణ ఇచ్చిన పార్టీ అనే అభిమానంతో ఒక్కసారైనా కాంగ్రెస్ కి చాన్స్ ఇద్దాం అని కాంగ్రెస్ కు పట్టం కడతారా? లేక..

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి తెలంగాణకు ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తుంది అని బీజేపీని గెలిపిస్తారా? అనేదానిపై దితెలుగున్యూస్ thetelugunews.com వెబ్ సైట్ సర్వే పోల్‌ నిర్వహిస్తోంది. ఈ సర్వేలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు అయితే చాలు. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటో సర్వే పోల్ ఓటు వేసి తెలియజేయండి.

[poll id=2]

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది