Vinayaka Chavithi : వినాయక చవితి నాడు, పాలవెల్లిని ఎందుకోసం కడతారు.?
Vinayaka Chavithi : వినాయక చవితి పండుగ హిందువులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగలు ఒకటి వినాయక చవితి. గణేశుడి పుట్టినరోజు కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ నాడు పూజ ది కార్యక్రమాలు అలంకరణ, ప్రసాదాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. అలాంటి సాంప్రదాయంలో ఒకటి ఈ గణపతి పండుగ కి కట్టే పాలవెల్లి. ఈ పండుగకు ముందు నాడు నుంచే పిల్లల్లో ఉత్సాహం మొదలవుతుంది. పాలవెల్లిని అలంకరించడానికి వివిధ రకాల పండ్లను తోరణాలు, మామిడి ఆకులు అన్ని ఎంతో ఇష్టంగా సిద్ధం చేస్తూ ఉంటారు. పాలవెల్లిని తమకి అనుగుణంగా అలంకరించి సంబరపడి పోతారు. అయితే కొందరు ఈ పండుగ రోజున పాలవెల్లి ఎందుకు కోసం కడతారో తెలిసి ఉండదు. మన గృహంలో పెద్దవారు కట్టేవారు. ఆనాటి సంప్రదాయాన్ని ఇప్పటికీ అనుసరిస్తూ.. ఇప్పుడు వారు కూడా కడుతున్నాం అని చెప్పేవారు. అనగా ఈనాడు వినాయక పండుగ సందర్భంగా పాలవెల్లిని దేనికికోసం కడతారో చూద్దాం…
వినాయక చవితి రోజు భాద్రపద మాసంలో శుక్లపక్షం సమితి తిథి రోజు వినాయక పండుగను జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో పెట్టే పిండి వంటలు, నైవోద్యం, నుంచి పూజకి వినియోగించే ఆకులు, పువ్వులు అలంకరణ అన్ని ఇతర వేడుకలకు వేరుగా ఉంటాయి. ప్రధానంగా ఈ పండుగ రోజు ప్రత్యేకమైన అలంకరణ పాలవెల్లి. దీనిని కట్టడానికి వెనక ఎన్నో కారణాలు ఉన్నాయని పురాణాల కథనం. అనంత విశ్వంలో భూమి అనువంతే… మనం భూమి మీద నిలబడి ఆకాశం వైపు చూస్తే మన కళ్లకు కనిపించే చంద్రుడు, సూర్యుడు తలదన్నే కోట్లాది కోట్ల నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాలు పాలసముద్రాన్ని చూసినట్లుగానే కనిపిస్తాయి. దానికోసం వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని పిలుస్తుంటారు. ఆ పాలవెల్లికి సంకేతంగా పాలవెల్లిని చతురస్రాన్ని కడుతూ ఉంటారు. వినాయకుని పూజ అంటే ప్రకృతి పూజ, ఈ ప్రకృతిలో, స్థితి, సృష్టి లయ అనే మూడు స్థితిలో ఉంటాయి. ఇవి వినాయకుడి ఆరాధనకు ఈ స్థితులకు ప్రతీకలు ఉంటాయి. స్థితి జీవనాన్ని సూచించేందుకు ప్రతిని. సృష్టి భూమిని సూచించేందుకు మట్టి ప్రతిమను. ఇక లయకి గుర్తుగా ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఏర్పాటు చేసి ఈ పూజలను నిర్వహిస్తూ ఉంటారు.
పాలవెల్లిలో నక్షత్రాలు కు గుర్తుగా రకరకాల వస్తువులను సూచిస్తూ.. మొక్కజొన్న పొత్తులు, జామ, దానిమ్మ ,ఎలగపండు ,మామిడి పిందెలు పండ్లతోనూ అలంకరిస్తూ ఉంటారు. వినాయకుని సాక్షాత్తు ఓంకార స్వరూపిడిగా.. గణానిధిపత్యం.. ప్రపంచానికి అధిపతి అటువంటి దేవుడికి చిత్రంగా పాలవెల్లిని కడుతూ ఉంటారు. వినాయకుని ఆడంబరంగా పూజించాల్సిన పనిలేదు. ఈ దేవుడిని మట్టి ప్రతిమ గా చేసుకుని.. దానిపైన పాలవెల్లిని వేలాడదీస్తూ గరికతో ఆరాధన చేస్తే చాలు.. పండగ ఎంతో అంగవైభవంగా చేసుకున్నట్లే… వినాయక అనుగ్రహం కలిగినట్లే… పసుపు రాసి కుంకుమ బొట్లను దిద్ది.. తోరణాలతో అలంకరించి పాలవెల్లి వినాయక ఆరాధనకు.. అద్భుతమైన శుభాలను అందిస్తుంది. పాలవెల్లి లేకుండా వినాయకుడి ఆరాధన సంపూర్ణం కానట్లే… వినాయకుడు అంటే గణాలకు అధిపతి, తొలి పూజలు అందుకునే దేవుడు. వినాయకుని ఆరాధిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించినట్లే. కావున దేవతలు అందరికీ సూచనగా పాలవెల్లిని వినాయక పండుగ నాడు ఏర్పాటు చేస్తూ ఉంటారు. సమస్త దేవతలకు ప్రతీకగా భావించి పాలవెల్లిని కడుతూ ఉంటారు.