Vinayaka Chavithi : సెప్టెంబర్ 18 వినాయక చవితి రోజు ఈ ఆకు పూజ గదిలో పెడితే చాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vinayaka Chavithi : సెప్టెంబర్ 18 వినాయక చవితి రోజు ఈ ఆకు పూజ గదిలో పెడితే చాలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :16 September 2023,8:00 am

Vinayaka Chavithi : వినాయక చవితి రోజున ఈ ఒక్క ఆకుతో పూజ చేస్తే చాలు.. కటిక పేదవాడైనా సరే రాజ్యమేలతాడు.. మీ పూజ గదిలో ఈ ఆకు పెడితే చాలు.. కటిక పేదవాడైనా సరే రాజ్యమేల తాడు వారి వినాయక చవితి రోజు చేయాల్సిన పూజ ఏ విధంగా ఉంటుంది. మరి వినాయక చవితి రోజు ఇలాంటి ఆకులతో పూజలు చేయాలి అనే విశేషాలు మనం తెలుసుకుందాం. అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటిగా ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర కర్ణాటక గోవా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో ప్రధానమైన పండుగగా గుర్తించబడింది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాలలో గణేష్ నిమజ్జనాన్ని దేశమంతా ఆసక్తిగా వీక్షిస్తారు. అంటే అతిశయోక్తి లేదు. ఈ పండుగ ఎప్పుడో దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా గొప్ప వేడుకగా జరపబడుతుంది. పరిపూర్ణతకు మారుపేరుగా వినాయకుని భావిస్తూ ఉంటారు. వినాయకుడు పవిత్రతకు విజయానికి మారుపేరుగా ఉంటాడు.

క్రమంగా చేపట్టిన ఎటువంటి ప్రాజెక్ట్ అయినా విజయవంతమై ఇందుకు సహాయపడతాడని చెప్పబడింది. ఏ పనిని ప్రారంభించిన పూజ లేదా యజ్ఞ యాగాదుల తలపెట్టిన ప్రారంభంలో వినాయకుని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. వినాయకునికి గరికంటే చాలా ఇష్టం. ఎన్ని రకాల పత్రాలు పుష్పాలతో పూజించినప్పటికీ ఈ గరిక లేకుండా విఘ్నేశ్వరుడి పూజ అనేది పూర్తికాదు. ఇంకా చెప్పాలి అంటే గరిక లేకుండా ఎన్ని పూలు పత్రి పెట్టిన ఆ పూజ అంతగా ఫలించదు అంటారు పండితులు.. గరికకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత అనేది ఏర్పడింది. అందుకే వినాయక చవితి రోజు ఈ యొక్క గరికతో చేసినటువంటి పూజ విశేష ఫలితాన్ని ఇస్తుంది అని చెబుతూ ఉంటారు. అయితే గ్రహణ సమయంలో కూడా ఈ గరికను వినియోగిస్తూ ఉంటారు. పూజ కోసం మాత్రమే కాకుండా ఔషధంగా కూడా ఈ గరికను ఉపయోగిస్తారు.

pooja room on the day of Vinayaka Chavithi on September 18

pooja room on the day of Vinayaka Chavithi on September 18

ఆయుర్వేద వైద్యంలో గరికను ఎంతో కాలంగా వినియోగిస్తూ వస్తున్నారు. గరిక వేర్లను మెత్తగా నూరి అందులో పసుపును కలిపి చర్మానికి లేపనంగా రాసుకోవడం వల్ల దదుర్లు, దురదలు, అలర్జీ వంటి చర్మవ్యాధులు అన్నీ కూడా తగ్గుతాయి అంటారు. గరిక ఆకులను పచ్చడిగా చేసుకుని అన్నంతో కలిపి తినడం వల్ల ఒంటినొప్పుల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది అంటారు. గరికను మెత్తగా నూరి గాయాలపై లేపనంగా రాయడం వల్ల గాయాల త్వరగా మానిపోతాయి. మరి అలా వినాయకునికి గడ్డి పోచకు ఉన్నటువంటి అనుబంధం ఆ విధంగా ఉంది.

ఎటువంటి పత్రితో పూజించిన ఎన్ని పూలమాలలు సమర్పించిన ఎటువంటి పుష్పాలతో ఆయన్ని అలంకరించిన ఒక్క గరిక పూజలో లేకపోతే ఆ వినాయకునికి పూజ యందు తృప్తి అనేది ఉండదు. అందుకే ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు కానీ ఈ గరికను మాత్రం ఆయనకు తప్పకుండా సమర్పించాలి. అప్పుడే ఆయన సంతోష్టుడు అవుతాడు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది