Sankranti Festival Rangoli : సంక్రాంతి పండుగకు ఇంటి ముందు ముగ్గులు వేయాలనుకుంటున్నారా..? మీకోసం ఈ రంగవల్లులు..!
ప్రధానాంశాలు:
Sankranti Festival Rangoli : సంక్రాంతి పండుగకు ఇంటి ముందు ముగ్గులు వేయాలనుకుంటున్నారా..? మీకోసం ఈ రంగవల్లులు..!
Sankranti Festival Rangoli : సంక్రాంతి అనగానే ముగ్గులు పిండి వంటలు, కొత్త బట్టలు ధనుర్మాసం వచ్చిందంటే చాలు.. తెలుగువారు ముగ్గులతో కళకళలాడతాయి. ఇలా రంగురంగుల ముగ్గులు ఎందుకు వేస్తారు. వీటి చరిత్ర ఏంటి ముగ్గులు వాటి చరిత్ర మహిళల జీవితంలో వాటి ప్రాధాన్యాన్ని ఓ పుస్తకంలో రచయిత రచించారు. ద్రవిడ సంస్కృతి దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇంటి ముందు ముగ్గులు వేయడం అంటే ఇరుగుపొరుగు వారి స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి ఓ మంచి సందర్భం కూడా.. ఇలా ఇంటి ముందు వేసుకునే ముగ్గులు కాకరమైన చీరలు ఆభరణాల డిజైన్లు కూడా వచ్చి చేరాయి. అయితే చాలామంది ఇంటి ముందు ముగ్గులు వేయాలి అనుకుంటారు.. ఇక్కడ కొన్ని ముగ్గురు ఉన్నాయి చూడండి..
1) భోగి కుండల ముగ్గు 11 చుక్కలు పెట్టి ఆరు చుక్కల వరకు మధ్య చుక్క పెట్టాలి. దీన్ని వేయడం చాలా ఈజీ భోగి రోజు ఇంటి ముందు వేస్తే చాలా బాగుంటుంది.
2) సంక్రాంతి రోజు వేయవలసిన సరియైన ముగ్గు ఇదే.. ఆవు, గాలిపటం, పొంగుతున్న పాలకుండ, ఉదయిస్తున్న సూర్యుడు, ధాన్యం, చెరుకు గడలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి..
3) చిలకల ముగ్గు ఈ ముగ్గు వేయడానికి తొమ్మిది చుక్కలు పెట్టి మధ్య చుక్క పెడుతూ ఆరు వచ్చేవరకు పెట్టాలి. ఈ ముగ్గు వేస్తే వాకిలి నిండుగా వస్తుంది.
4) అందమైన కలువ పువ్వుల ముగ్గు. అందమైన డిజైన్ల ముగ్గు ఇది..ఈ ముగ్గురు ఇంటిముందు వేసి రంగులు దిద్దితే కళకళలాడిపోతుంది.
5) డిజైన్ల ముగ్గులు ఇష్టపడే వారికి ఈ ముగ్గు చాలా బాగా నచ్చుతుంది. ఈ ముగ్గు రంగులు వేయడానికి ఉత్తమమైనది.. ఇంటి ముందు పూల ముగ్గులు వేస్తే చాలా అందంగా ఉంటుంది.
6) హ్యాపీ పొంగల్ అని రాసుకుని ఈ ముగ్గుని వేసుకోవచ్చు.. ఈ హ్యాపీ న్యూ ఇయర్ స్థానంలో హ్యాపీ పొంగలి అని రాయండి. అందమైన పువ్వుల జతగా నెమలి ఉంటుంది. ఈ ముగ్గు ఇంటి ముందు వేస్తే ముచ్చటగా ఉంటుంది..