Shravana Masam : అధిక శ్రావణ మాసం ఎప్పుడు అంటే .. ప్రారంభ ముగింపు తేదీలు .. వరలక్ష్మీ వ్రతం .. పూర్తి వివరాలు ?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shravana Masam : అధిక శ్రావణ మాసం ఎప్పుడు అంటే .. ప్రారంభ ముగింపు తేదీలు .. వరలక్ష్మీ వ్రతం .. పూర్తి వివరాలు ??

 Authored By aruna | The Telugu News | Updated on :22 June 2023,7:00 am

Shravana Masam : 2023 సంవత్సరంలో రెండు శ్రావణ మాసాలు వచ్చాయి. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మాసం అధికమాసం వస్తుంటుంది. ఈసారి శ్రావణమాసం అధిక మాసంగా వచ్చింది. రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు రెండు నెలలపాటు ఒకే రాశిలో ఉంటాడు. ఏ మాసంలో అయితే సూర్యుడు సంక్రమణం జరగదు. దానిని అధికమాసం అంటారు. ఈ సంవత్సరమునకు అన్ని పండుగలను ముందుగానే జరుపుకుంటున్నాం. ఉదాహరణకు రథసప్తమి ఫిబ్రవరిలో రావాలి కానీ ఈసారి జనవరిలోనే వచ్చింది. ఇక ఉగాది పండుగ, శ్రీరామనవమి ఎప్పుడు ఏప్రిల్ నెలలో చేస్తూ ఉంటాము కానీ ఈసారి మార్చిలో చేశాం. అయితే అధికమాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. దేవుడికి సంబంధించిన పూజలు చేసుకోవచ్చు.

ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. అయితే శ్రావణ మాసం ఆగస్టు 17వ తేదీ ప్రారంభమై సెప్టెంబర్ 15 కు ముగుస్తుంది. అయితే అధిక మాసంలో నాలుగు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 18 , రెండవ శుక్రవారం ఆగస్టు 25న వచ్చింది. శ్రావణమాసం సెప్టెంబర్ 17వ తేదీన ముగిస్తుంది. అయితే లాస్ట్ శుక్రవారం అమావాస్యతో వచ్చింది కాబట్టి దానిని పరిగణలోకి తీసుకోకూడదు. ఇక వరలక్ష్మి వ్రతం రెండవ శుక్రవారంలో జరుపుకుంటాం. అమ్మవారికి పూజ చేయాల్సినవారు ఆగస్టు 25వ తేదీన తెల్లవారుజామున 5:48 నుంచి 8 :14 నిమిషాల వరకు చేయడం మంచి సమయం .

shravana masam significance

shravana masam significance

ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మంచి శుభాలు కలుగుతాయి. అయితే ఇంత ఉదయాన్నే అమ్మవారిని అలంకరించి పిండి వంటలు చేసి పూజించడం కష్టంగానే ఉంటుంది. ఇక ఉదయం కుదరని వారు సాయంత్రం కూడా చేసుకోవచ్చు. 5:52 నిమిషాల నుంచి 6:17 నిమిషాల వరకు అమ్మ వారిని పూజించడానికి మంచి సమయం. ఈ శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వచ్చాయి. ఐదో శుక్రవారం అమావాస్య కాబట్టి దానిని పరిగణలోకి తీసుకోకూడదు. మొదటిసారి చేసేవారు పెద్దలనుంచి దానికి సంబంధించిన వివరణ అంతా తెలుసుకొని చేయడం మంచిది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే శుభవార్తలను ఉంటారు. ఆర్థికపరంగా మంచి పొజిషన్లో ఉంటారు. ఇంట్లో మానసిక ప్రశాంతత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది