Money : స్త్రీలకు ఈ అలవాట్లు ఉంటే డబ్బు సమస్యలు తప్పవు… వెంటనే మానుకోండి….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Money : స్త్రీలకు ఈ అలవాట్లు ఉంటే డబ్బు సమస్యలు తప్పవు… వెంటనే మానుకోండి….!

 Authored By ramu | The Telugu News | Updated on :19 August 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Money : స్త్రీలకు ఈ అలవాట్లు ఉంటే డబ్బు సమస్యలు తప్పవు... వెంటనే మానుకోండి....!

Money : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జీవితంలో అనేక రకాల ఇబ్బందులకు వ్యక్తిగత చెడు అలవాట్లు కూడా కారణమని చెప్పడం జరిగింది. జీవితంలో అన్ని నియమాలను విష్మరించి ఆధునికత పేరుతో జీవించే వారికి అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. ఇక ఈ సమయంలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా మీ సమస్యలు తగ్గకపోతే దానికి కారణం కొన్ని రకాల చెడు అలవాట్లేనని నిపుణులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా స్త్రీలలో ఈ అలవాట్లు ఉన్నట్లయితే వారి ఇంట్లో డబ్బు కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు. మరి ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Money నిద్రపోయే అలవాటు..

ప్రస్తుత కాలంలో చాలామంది రాత్రి సమయంలో చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీంతో ఉదయం లేటుగా లేవడం అనేది అలవాటుగా మారిపోయింది. అయితే స్త్రీలకు ఈ చెడు అలవాటు ఉన్నట్లయితే వెంటనే మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే స్త్రీలు ఇలా చేసినట్లయితే చంద్రగ్రహానికి సంబంధించిన ఆగ్రహానికి గురవుతారట. తద్వారా మానసిక ఒత్తిడి , మనసుకి సంబంధించిన ఇబ్బందులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కావున ఎవరికైనా ఇలాంటి చెడు అలవాటు ఉన్నట్లయితే వెంటనే మానుకోవడం మంచిది.

Money ఇంట్లో మొక్కలు ఎండిపోకూడదు…

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో మొక్కలు అనేవి అసలు ఎండిపోకూడదు. ఇంట్లో పెంచుకున్న మొక్కలకు కచ్చితంగా నీరు ఇచ్చి సేవలు చేయాలి. ఈ నియమాన్ని విస్మరించి ఎండిపోయిన మొక్కలను ఇంట్లో ఉంచుకున్నట్లయితే అనేక రకాల దోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Money బాత్రూం శుభ్రంగా ఉండాలి…

ప్రతి ఒక్కరి ఇంట్లో బాత్రూం అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ బాత్రూం ని ఖచ్చితంగా చాలా శుభ్రంగా ఉంచుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. లేకపోతే రాహుకేతువుల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బాత్రూం శుభ్రంగా ఉంచుకోకపోవడం వలన ఆకస్మిక సమస్యలు ఎదురుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Money స్త్రీలకు ఈ అలవాట్లు ఉంటే డబ్బు సమస్యలు తప్పవు వెంటనే మానుకోండి

Money : స్త్రీలకు ఈ అలవాట్లు ఉంటే డబ్బు సమస్యలు తప్పవు… వెంటనే మానుకోండి….!

తిన్న తర్వాత ప్లేట్లు అక్కడే పెట్టవద్దు…

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భోజనం చేసిన తర్వాత అదే ప్రదేశంలో పాత్రలను వదిలేసి వెళ్లకూడదు. వెంటనే వాటిని వంట గదిలోకి మార్చాలి. లేకపోతే శని సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది