Vinayaka Vratam : వినాయక వ్రతంలో అసలైన అచ్చ తెలుగు ప్రసాదం ఇదే…
Vinayaka Vratam : వినాయక చవితి రోజున గణేశుడికి వివిధ రకాల ప్రసాదాలను సమర్పిస్తూ ఉంటారు. అసలు పూర్వపు రోజుల్లో వినాయకుడికి ఇన్ని ప్రసాదాలు చేసేవారు కాదు, ఇలా కూడా చేసేవారు కాదు. తక్కువ నూనెలో నెయ్యిలు వేసి ప్రసాదాలను చేసేవారు. అయితే ఇప్పుడు అచ్చ తెలుగు వినాయకుడు ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: 1)తడి బియ్యం 2) బెల్లం 3) కొబ్బరి 4) యాలకులు 5) మిరియాలు 6) ఆవాలు 7) జీలకర్ర 8) నెయ్యి 9) మినప్పప్పు 10) పెసరపప్పు 11) ఇంగువ 13) కరివేపాకు
ముందు రోజే తడి బియ్యాన్ని మెత్తగా పట్టించాలి. తేమ ఆరిపోకుండా చూసుకోవాలి. ముందు రోజే బెల్లాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి. అలాగే యాలకులు మిరియాలు దంచి పెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి రెండు కప్పుల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం కలిపి నానబెట్టుకోవాలి. మరిసేటి రోజు వినాయకుడికి కొబ్బరికాయను కొట్టండి. సగం కొబ్బరికాయను పలుకులుగా చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కప్పు పెసరపప్పును నానబెట్టుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మన తెలుగు వారు చేసుకునే అచ్చ తెలుగు ప్రసాదం పచ్చి చలిమిడి. దీనికోసం పావు కప్పు బెల్లం ముప్పావు కప్పు తడి బియ్యం ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే మొదటి ప్రసాదం పచ్చి చెలిమిడి రెడీ అయినట్లే. ఇక రెండవది మిరియాల కుడుములు. దీనికోసం ఒక కప్పు మరిగే నీటిలో నిన్న రాత్రి తురుముకున్న బెల్లం వేసి కరిగాక నానబెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పు, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, పావు కప్పు పచ్చి కొబ్బరి వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.
ఇందులోనే నిన్ను రాత్రి జలించి పెట్టుకున్న తడి బియ్యాన్ని వేసి మీడియం ఫ్లేమ్ లో దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. చివర్లో కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారాక ఉండ్రాళ్ళు లాగా చుట్టుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన ఉండ్రాళ్ళు రెడీ. మిరియాల కుడుములు: దీనికోసం మూడు కప్పుల నీళ్లు తీసుకొని అందులో ఒక అప్పు తడి బియ్యం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని అర టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి ఇందులో రెండు చిటికెడుల ఇంగువ, కొద్దిగా కరివేపాకు, ఒక టీ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత పావు కప్పు సన్నని కొబ్బరి పలుకులు, అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి ఉంచుకున్న బియ్యం పిండి నీళ్లు పోసి ముద్దగా అయ్యేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి. చల్లారాక కుడుములు లాగా చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిరియాల కుడుములు రెడీ.