veedhi potue effects : వీధిపోట్లతో కలిగే ఫలితాలు ఇవే
veedhi potue effects : ఇల్లు.. వాస్తు ప్రకారం ఉండాలనుకుంటారు అందరూ. కానీ అనుకున్న విధంగా మనుకు స్థలం లేదా ఇండ్లు ఉండవు. అయితే చాలా చోట్ల వీధి చూపు ఇంటిపై లేదా ఖాళీ స్థలంపై ఉంటుంది. అయితే వాటిలో ఏది మంచిది ఏ వీధిపోటు మంచిది కాదు అనేది తెలుసుకుందాం.. వాస్తుపరంగా చూస్తే..
వీదిపోటుల్లో రకాలు, వాటివాటి ఫలితాలు కొన్ని వీధి పోట్లలో మంచివి, చెడ్డవి అని రెండు రకాల వీధి పోటులు ఉన్నాయి. ఈ వీధిలో నడిచేవారు ఆ భవనాన్ని పొడిచినట్టుగా నడుస్తారు అనే భావాన్ని స్ఫురింపజేస్తుంది. ఒక ఇంటి ముందుగల వీధి ఇంటిని దాటిన వెంటనే వీధి వంపు తిరిగి తిన్నగా పెరిగితే వంపు వద్దగల ఇల్లు వీధి పోటుగల ఇల్లు అవుతుంది..
ఈశాన్యము వీధిపోటు అనగా :
ఈశాన్య వీధిపోటు కలిగితే అది ఈశాన్య వీధి పోటూ అంటారు. ఈ వీధి పోటు వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రమాదమేమీ ఉండదు.
ఆగ్నేయ వీధిపోటు : veedhi potue effects
దీనివల్ల కూడా ఇంట్లో ఉండే వాళ్లకి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. పడమర వీధి పోటు అయితే ఇది కొంత మంచి కొంత చెడు ఫలితాలను ఇస్తుంది ప్రమాదకరమైన సందర్భం ఉండదు.
వాయవ్యపు వీధి పోటు : veedhi potue effects
కూడా చెడు ఫలితములనిస్తుంది. దీని ప్రభావం వలన ఆ ఇంటిలోని వారు మానసిక శాంతి లేక ఆర్థిక బాధలలో ఇబ్బందులు పడుతారు.
పశ్చిమ వాయువ్యం పోటు మంచిదే. దక్షిణ నైరుతి వీధి పోటు ఇది చాలా నీచమైనది. దీనివలన ఇంటికి కొంత అసౌకర్యం. అనారోగ్యం కూడా పెరుగుతుంది. అయితే ఆయా వీధిపోట్లు ఎన్ని డిగ్రీల కోణంలో ఉన్నాయి. ఎదురుగా ఉన్న రోడ్డు కంటే మధ్యలో వచ్చిన రోడ్డు పెద్దదా? లేక చిన్నదా అనే అనేక రకాల సూక్ష్మ అంశాలతో ఈ వీధిపోట్ల ఫలితాలను లెక్క కడుతారు. సాధ్యమైనంత వరకు వీధిపోట్ల ఇండ్లకు దూరంగా ఉండండి. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే సరైన పండితులను సంప్రదించి వాటిని కొనుగోలు చేయండి.