Maadhavi Latha : అలా చేయకపోతే రేప్ చేస్తామని బెదిరించారు… పార్టీ నాయకుల గురించి పచ్చి నిజాలు బయట పెట్టిన యాక్ట్రెస్ మాధవి లత…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Maadhavi Latha : అలా చేయకపోతే రేప్ చేస్తామని బెదిరించారు… పార్టీ నాయకుల గురించి పచ్చి నిజాలు బయట పెట్టిన యాక్ట్రెస్ మాధవి లత…!

 Authored By aruna | The Telugu News | Updated on :23 February 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Maadhavi Latha : అలా చేయకపోతే రేప్ చేస్తామని బెదిరించారు... పార్టీ నాయకుల గురించి పచ్చి నిజాలు బయట పెట్టిన యాక్ట్రెస్ మాధవి లత...!

Maadhavi Latha : పసుపులేటి మాధవి లత… ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలలో గ్లామరస్ బ్యూటీ. అయితే మాధవి లత మొదట “నచ్చావులే” అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది. ఇక ఈ సినిమా వాణిజ్యపరంగా విజయవంతమై మూడు నంది అవార్డులను కూడా గెలుచుకుంది. ఇక ఈ సినిమా తర్వాత తమిళ్ సినీ ఇండస్ట్రీలో కూడా మాధవి లత నటించడం జరిగింది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో స్నేహితుడా , అరవింద్ 2 , అంబల వంటి సినిమాల్లో మాధవి లత నటించారు. అనంతరం ఈ గ్లామరస్ బ్యూటీ 2018లో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అలాగే 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి ఈమె పోటీ కూడా చేశారు. ఇక ఆ నియోజకవర్గంలో ఆమె ఓడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది. అప్పటినుండి రాజకీయాల్లో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితాల గురించి తన కెరియర్ లో ఎదుర్కొన్న సమస్యల గురించి , పలు రకాల ఇంటర్వ్యూలలో చెబుతూ వస్తుంది.అయితే కొన్నిసార్లు ఈమె చెప్పే మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి.

అదేవిధంగా టిఎన్ఆర్ కు ఇచ్చిన ఓంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితంలో మరియు సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యలను కాస్టింగ్ కౌచ్ వంటి విషయాల గురించి కూడా బయట పెడుతూ వచ్చారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవి లత ఈ సందర్భంగా మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో జరిగిన విషయాలను అనుభవాలను మీడియా ముందు ప్రస్తావించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా పార్టీ పెద్దలు కూడా నాకు చెప్పేది ఒకటే..నీవు ఉన్న పార్టీలో నీకు గుర్తింపు లభించకపోతే ప్రతిపక్ష పార్టీ నీకు గుర్తింపు ఇవ్వాలని చూస్తే ఆ పార్టీకి వెళ్ళు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి. నీ జీవితం నీ వయసు చాలా ముఖ్యమైనది అంటూ చెప్పేవారని తెలియజేశారు. అలా ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను నా కమలం పార్టీకి స్టిక్ అయి ఉన్నాను అంటూ ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అయినప్పటికీ కూడా జాబితాలో ఆమె పేరు రాకపోవడంతో ఆమె చాలా అసంతృప్తి చెందారని ఈ సందర్భంగా తెలియజేశారు.

అంతేకాక తన సొంత పార్టీలో ఆమెకు ఎవరు తోడుగా నిలబడలేదని చెప్పుకొచ్చారు. ఒకానొక సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు నా గురించి పలు రకాల విమర్శలు చేశారు. ఇంకా వార్తలు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు నా గురించి తప్పుగా మాట్లాడుతూ ,నన్ను అలా చేస్తాం ఇలా చేస్తామని , నీ అసభ్యకరమైన వీడియోలు బయటపెడతామంటూ ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఇంతే అంటూ పలు రకాల ఆరోపణలు చేసిన కూడా నా సొంత పార్టీ వాళ్లు నా తరఫున నిలబడలేదని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఇక బిజెపి పార్టీ అంటే కుటుంబం పాలన కాదని పార్టీ కుటుంబమని అంటారు. కానీ అలాంటి పార్టీలో నాకు మాత్రం అండగా ఎవరూ నిలబడలేదని ,ఇక అలాంటి సందర్భంలో నేను ఒంటరితనాన్ని ఫీలయ్యానంటూ ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. ఇక నా పార్టీ కోసం ఎన్నో క్యాంపింగ్ లు , ఎన్నో ప్రచారాలు చేసినప్పటికీ నాకు తగిన గుర్తింపు మాత్రం లభించడం లేదని ఇలా నాకే ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది