Maadhavi Latha : హోటల్లో బట్టల్లో విప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మినిస్టర్లు.. రాజకీయ నాయకుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీ లత..!
ప్రధానాంశాలు:
Maadhavi Latha : హోటల్లో బట్టల్లో విప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మినిస్టర్లు.. రాజకీయ నాయకుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీ లత..!
Maadhavi Latha : తెలుగు పరిశ్రమలో హీరోయిన్ గా మాధవీలత కు మంచి గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో తక్కువ సినిమాలలో నటించినప్పటికీ ఆమె ప్రజలకు గుర్తుండిపోయారు. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగ లేకపోయినా ఆమె రెండు మూడు సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఎందుకో ఆమెకు సినీ ఆఫర్స్ ఎక్కువగా రాలేదు. ఇలా ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యారు. ఈ విధంగా మాధవీ లత ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇండస్ట్రీ కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతుంటారు. ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలుసు. కొన్నిసార్లు ఆమె చేసే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతుంటాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా తరచు వార్తల్లో నిలుస్తుంటారు.
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవీ లత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలోకి వెళ్లాలని అనుకున్నానని, కొందరు నాయకులు కూడా పార్టీలోకి రమ్మని పిలిచారని, అందుకు వెళదామని సిద్ధంగా ఉంటే లిస్టులో నా పేరు రాలేదని, దీంతో నేను చాలా బాధపడ్డాను అని మాధవీ లత అన్నారు. పార్టీ పెద్దలు పార్టీ గుర్తింపు ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్ళమని చెప్పారు. కానీ ఆ పార్టీలోనే ఉండాలని మొండిగా ఉన్నాను. పదవి ఇవ్వకపోయినా కానీ మీడియాలో కనిపించడం మానలేదు. గతంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి నేను ఒకటి చెబితే వాళ్లు మరొకటి రాసుకొని నాపై ఎమోషనల్ టార్చర్ చేశారని ఆమె అన్నారు. ఒక ఆడపిల్లని ఎన్ని మాటలు అనకూడదో అన్ని మాటలు అన్నారని,
రేప్ చేస్తామని, రాడ్లు దింపుతామని, చంపుతామని, నువ్వేమైనా పెద్ద తోపా అంటూ మాట్లాడారని ఒక ఆడపిల్లని క్యారెక్టర్ పరంగా దెబ్బతీస్తే ఆమె ఏం చేయలేదని అనుకుంటారు. మగవాడు ఎన్ని పనులు చేసిన వాడిని ఏమీ అనరు. బట్టలిప్పి వీడియోలలో కనిపించిన వాళ్లు ఎంపీలు గా కొనసాగుతున్నారు. మసాజులు చేస్తామంటూ వీడియోలు తీసిన వాళ్ళు ఎమ్మెల్యేలు గా కొనసాగు తోనే ఉంటారు. కానీ ఆడపిల్ల పై అబద్ధపు ప్రచారాన్ని క్రియేట్ చేసి ఆమె జీవితాన్ని నాశనం చేస్తారు అని ఆమె సీరియస్ వ్యాఖ్యలు చేసారు. ఇక మనకు తెలిసిందతెలిసిందే మాధవీ లత గతంలో రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆమె వెళ్లలేకపోయారు. కానీ టీవీలో సోషల్ మీడియాలో రాజకీయాలపై స్పందిస్తూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీ గురించి కూడా స్పందిస్తూ ఉంటారు.