Maadhavi Latha : జేసీపై ఫిర్యాదు ను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు.. మాధవీ లత సంచలన కామెంట్స్
ప్రధానాంశాలు:
Maadhavi Latha : జేసీపై ఫిర్యాదు ను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు.. మాధవీ లత సంచలన కామెంట్స్
Maadhavi Latha : రెండు రోజులుగా నటి, బీజేపీ BJP నాయకురాలు మాధవీ లత Maadhavi Latha వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకు కారణం జేసీ ప్రభాకర్ రెడ్డిపై jc prabhakar reddy సీరియస్ అవుతుండటం, ఆయనపై కంప్లయింట్ చేయడం వంటి విషయాలతో ఆమె వార్తలలో నిలుస్తున్నారు. అదలా ఉంటే.. తాజాగా ఆమె Social Media సోషల్ మీడియాలో కాస్త మోడ్రన్‌గా కనిపించే అమ్మాయిలపై కామెంట్స్ చేసే వారికి సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే TDP టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి tadipatri మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో jc prabhakar reddy నెలకొన్న వివాదాన్ని బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీ లత అంత ఈజీగా ముగించేందుకు అంత ఈజీగా ఒప్పుకోవడం లేదు.
Maadhavi Latha మాధవీ లత ఆగ్రహం..
జేసీ ఇప్పటికే సారీ చెప్పినా… ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేసి ఆపై సారీ అంటే సరిపోతుందా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ కు ఫిర్యాదు చేసిన మాధవీ లత… తాజాగా మంగళవారం నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె తన ఫిర్యాదులో పోలీసులను కోరారు.మాధవీ లత కేరెక్టర్ నే టార్గెట్ చేసిన జేసీ… ఆమెను ఓ వ్యభిచారిణిగా అభివర్ణించారు. ఓ సినిమా షూటింగ్ కోసం తాడిపత్రి వచ్చిన మాధవీ లత.. ఎలాంటి నిర్వాకాలు చేసిందో అందరికీ తెలుసునని కూడా ఆయన అన్నారు. మాధవీ లత లాంటి వారు కూడా తాడిపత్రి కల్చర్ గురించి మాట్లాడితే సహించేది లేదని కూడా ఆయన ఫైరయ్యారు. ఏమైందో తెలియదు గానీ… ఆ తర్వాత జేసీనే తన వ్యాఖ్యలపై సారీ చెప్పారు. మాధవీ లతపై తాను అలా మాట్లాడాల్సింది కాదని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తనది తప్పేనని, అందుకు తాను సారీ చెబుతున్నానని జేసీ చెప్పారు.
రాంగ్ పర్సన్‌తో పెట్టుకున్నారు. నా గొంతు మూయించడం వారితో కాదు. నేను కూడా రాయలసీమ ప్రాంతంలోనే పెరిగా. రాగి సంగటి, నాటుకోడి తినే పెరిగా. ఫ్యాక్షన్ స్టోరీలు చూశా. రక్తం కారేది చూశా. అవన్నీ చూస్తూ పెరిగాను. నాకు భయమంటే తెలియదు. సినిమా రంగంలో పనిచేస్తున్న మహిళలను అవమానించేలా ఆయన మాట్లాడారు. ఆయనపై న్యాయ పోరాటం చేస్తా” అని మాధవీలత స్పష్టం చేశారు.నాకు నా బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. న్యాయం చేస్తామని పోలీసులు నాకు హామీ ఇచ్చారు. మహిళలను కించే పరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే వారిని వదిలిపెట్టం అని సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ చెప్పారు. ఆ మాటకు వాళ్లు కట్టుబడి ఉండాలి అని మాధవీ లత పేర్కొంది.