Akkineni Nagarjuna : అక్కినేని వారి ‘ఆచార్య’… ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ

Authored By aruna | The Telugu News | Published on: August 8, 2022, 8:00 pm

Akkineni Nagarjuna : మెగాస్టార్ చిరంజీవి – Chiranjeevi మరియు ఆయన తనయుడు రామ్‌ చరణ్ – Ram Charan కలిసి నటించిన ఆచార్య – Acharya సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దర్శకుడు కొరటాల శివ – Koratala Siva సినిమా ను అత్యంత దారుణంగా తెరకెక్కించాడు అంటూ విమర్శలు వచ్చాయి. చిరంజీవి మరియు రామ్‌ చరణ్ ఉన్న నేపథ్యంలో ఆయన మినిమం మంచి కథతో ఒకింత మంచి స్క్రీన్‌ ప్లేతో సినిమాను తీసి ఉంటే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు సినిమాకు బ్రహ్మరథం పట్టే వారు అనడంలో సందేహం లేదు. ఒక మంచి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ మిస్‌ అయ్యిందని మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి, కొడుకులు నటించిన సినిమా అంటే.. నటించబోతున్న సినిమా అంటే సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ మధ్య మంచు వారి కుటుంబ సభ్యులు కలిసి నటించారు అంటేనే తెలుగు ప్రేక్షకులు అంతా కూడా అటువైపు చూశారు. అలాంటిది ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుండి తండ్రి కొడుకులు ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారట. చిరంజీవితో ప్రస్తుతం లూసీఫర్ సినిమాను చేస్తున్న దర్శకుడు మోహన్‌ రాజా. ఆయన దర్శకత్వంలో రూపొందిన లూసీఫర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Akkineni Nagarjuna and akhil multi starrer movie coming soon in mohan raja direction

Akkineni Nagarjuna and akhil multi starrer movie coming soon in mohan raja direction

ఈ దర్శకుడు మోహన్‌ రాజా ఇటీవలే నాగార్జున – Nagarjuna మరియు అఖిల్ – Akhil లకు ఒక కథ చెప్పారట. ఆ కథ బాగుందని వార్తలు వస్తున్నాయి. మల్టీ స్టారర్ కాన్సెప్‌.. అలాగే అండ్రి కొడుకుల కాన్సెప్ట్‌.. దాంతో అక్కినేని వారి ఆచార్య సినిమా అన్నట్లుగా అప్పుడే చర్చ మొదలు అయ్యింది. తండ్రి కొడుకులు కలిసి నటించడం వల్ల అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నాగార్జున మరియు అఖిల్‌ లతో ఒక మంచి మల్టీ స్టారర్‌ సినిమాను దర్శకుడు మోహన్‌ రాజా తీస్తాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. అతి త్వరలోనే సినిమా గురించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

aruna

No bio available for this author.

  1. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  2. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  3. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  4. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  5. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  6. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  7. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp