Amitabh Bacchan : బాలీవుడ్ మేకర్స్ కి అమితాబ్ కొత్త ఛాలెంజ్.. ఆ పనికి ఏజ్ తో సమ్నంధం లేదని చూపించాడు..!
Amitabh Bacchan : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కల్కి సినిమాతో మళ్లీ తిరిగి సూపర్ ఫాం లోకి వచ్చారు. కల్కి సినిమాలో ప్రభాస్ తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది అమితాబ్ అనే చెప్పొచ్చు. అఫ్కోర్స్ లోకనాయకుడు కమల్ హాసన్ చేసిన సుప్రీం యాస్కిన్ పాత్ర కూడా బాగుంది. ఐతే స్క్రీన్ స్పేస్ వల్ల కమల్ ఇంపాక్ట్ కన్నా అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ చేసిన రచ్చ ఒక రేంజ్ లో ఉంది. ఒకానొక దశలో ప్రభాస్ ని డామినేట్ చేసే రేంజ్ లో అమితాబ్ తన యాక్టింగ్ తో అదరగొట్టాడు.
కల్కి సినిమా చూసిన ఎవరైనా అమితాబ్ ని ఇంతగా వాడుకున్న డైరెక్టర్ ఈమధ్య కాలంలో ఎవరు లేరని అనిపిస్తుంది. తన ఏజ్ కి తగిన పాత్రల్లో నటిస్తూ వస్తున్న అమితాబ్ కల్కిలో అశ్వద్ధామ పాత్రలో తన మార్క్ చూపించారు. అసలు 80 ప్లస్ అమితాబ్ ప్రభాస్ తో ఫైట్ చేయడం అన్నది ఊహిస్తేనే నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తుంది. అమితాబ్ యాక్టింగ్ తో కల్కికి కొత్త వన్నె తెచ్చారు.అంతేకాదు బాలీవుడ్ మేకర్స్ అందరికీ అమితాబ్ కొత్త ఛాలెంజ్ ఇచ్చినట్టు అయ్యింది. ఆయన్ను కేవలం ఏజ్ కి తగిన పాత్రల్లో కాదు ఇలా ప్రయోగాలు కూడా చేయొచ్చు అని ప్రూవ్ చేసింది.
Amitabh Bacchan అమితాబ్ కోసం కొత్త కథలు రాయాల్సిందే
కల్కి అశ్వద్ధామ పాత్ర అమితాబ్ చేసిన మైల్ స్టోన్ సినిమాలతో పాటు నిలుస్తుందని చెప్పొచ్చు. కల్కి తర్వాత బాలీవుడ్ లో కూడా అమితాబ్ కు వరుస క్రేజీ ఆఫర్లు వచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ కల్కి వసూళ్ల హంగామా ఒక రేంజ్ లో ఉంది. ఈ దూకుడు చూస్తుంటే ప్రభాస్ ఖాతాలో మరో 1000 కోట్ల సినిమా లోడ్ అవుతుందని చెప్పొచ్చు. సినిమాలో దీపిక పదుకొనె కూడా తన మార్క్ నటనతో మెప్పించింది. సినిమాలో వాళ్లను ఎందుకు తీసుకున్నారో అని చూశాక ప్రేక్షకులకు బాగా అర్ధమైంది. కల్కి విషయంలో టేకింగ్, డైరెక్షన్ కాదు కాస్టింగ్ సెలక్షన్ లో కూడా నాగ్ అశ్విన్ వారెవా అనిపించాడు.