Anasuya : ఆడపిల్లని కనాలని ఉంది.. మనసులోని కోరిక బయటపెట్టేసిన అనసూయ
Anasuya : ఇంట్లో ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మీ ఉన్నట్టే అని మనమంతా నమ్ముతాం. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారంగా భావించేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం ఆడపిల్ల కావాలని అందరూ కోరుకుంటున్నారు. అలానే అనసూయ కూడా ఆడపిల్లను కనాలని కోరుకుంటోంది. ఇప్పటికే అనసూయ ఇద్దరు పిల్లలకు తల్లి. అనసూయకు ఇద్దరూ అబ్బాయిలే. దీంతో అమ్మాయి పుట్టలేదని తెగ బాధపడుతున్నట్టుగా తాజాగా అందరికీ అర్థమైంది.అనసూయ సుశాంక్ భరద్వాజ్‌ల ప్రేమ, పెళ్లి గురించి అందరికీ తెలిసిందే.
ఇక జబర్దస్త్ మంచి పీక్స్‌లో ఉండగానే అనసూయ గర్భం దాల్చింది. దీంతో బుల్లితెరకు దూరం కావాల్సి వచ్చింది. ఆ తరువాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. తన ఫిజిక్‌ను కాపాడుకుంటూ ఇంకా అవకాశాలను సంపాదించేస్తోంది. అయితే అనసూయ మీద మాత్రం ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది.ఆ మధ్య మూడో సంతానం గురించి కూడా అనసూయ స్పందించింది. ఓ నెటిజన్ ఈ విషయం మీద అడిగితే..

Anasuya Wants To Give Birth To Baby Girl
చాలా సీరియస్ అయినట్టుంది. అయితే తాజాగా అనసూయ తన మనసులోని కోరికను బయటపెట్టేసింది. అనసూయ తాజాగా శ్రీరామనవమి ఈటీవీ ఈవెంట్‌లో కనిపించింది. శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి అనే ఈవెంట్‌లో అనసూయ కన్నీరు పెట్టేసుకుంది.అనసూయకు ఇద్దరు అబ్బాయిలే.. అమ్మాయి పుట్టాలని కోరుకుంటుంది అని రష్మీ చెప్పుకొచ్చింది. అవును అది ఎప్పటికైనా నెరవేరుతుందని ఆశిస్తున్నాను అంటూ అనసూయ ఎమోషనల్ అయింది. మొత్తానికి అనసూయ కోరిక త్వరలోనే నెరవేరుతుందేమో చూడాలి.
