Anchor Rashmi : అది చూసి యాంకర్ రష్మి ఫిదా.. సూపర్ రా అంటూ ప్రశంసలు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Rashmi : అది చూసి యాంకర్ రష్మి ఫిదా.. సూపర్ రా అంటూ ప్రశంసలు!

Anchor Rashmi  : యాంకర్ రష్మి సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక తెరపై ఎలా నవ్వుతూ, నవ్విస్తూ సందడి చేస్తారో సోషల్ మీడియాలోనూ అలానే ఉంటారు. ఇక ఎక్కువగా ఆమె సోషల్ మీడియాను సమాజ సేవకు వాడుతుంటుంది. మూగ జీవాల పరిరక్షణ అంటూ వీధి కుక్కలు, జంతువుల కోసం పాటుపడుతుంటుంది. అలా రష్మి ఎన్నో స్వచ్చంద సంస్థలతో కలిసి పెట్స్ కోసం పని చేస్తుంటుంది. తాజాగా రష్మి తనను ఇమిటేట్ చేసిన […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :10 August 2021,6:30 pm

Anchor Rashmi  : యాంకర్ రష్మి సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక తెరపై ఎలా నవ్వుతూ, నవ్విస్తూ సందడి చేస్తారో సోషల్ మీడియాలోనూ అలానే ఉంటారు. ఇక ఎక్కువగా ఆమె సోషల్ మీడియాను సమాజ సేవకు వాడుతుంటుంది. మూగ జీవాల పరిరక్షణ అంటూ వీధి కుక్కలు, జంతువుల కోసం పాటుపడుతుంటుంది. అలా రష్మి ఎన్నో స్వచ్చంద సంస్థలతో కలిసి పెట్స్ కోసం పని చేస్తుంటుంది. తాజాగా రష్మి తనను ఇమిటేట్ చేసిన ఓ యువతిని పొగిడేసింది.

Anchor Rashmi Praises Who Imitated Her Dance

Anchor Rashmi Praises Who Imitated Her Dance

ఈ మధ్య రష్మీ ఇతర చానెల్స్‌లోనూ కనిపిస్తోంది. మొన్నటికి మొన్న స్టార్ మాలో సిక్స్త్ సెన్స్ షోలో కనిపించింది. ఇక గత ఆదివారం ఆషాడంలో అత్తాకోడళ్లు అనే షోతో దుమ్ములేపేసింది. జీ తెలుగులో రష్మీ చేసిన రచ్చ మామూలుగా క్లిక్ కాలేదు. ఆమె పాడిన, వేసిన మాస్ స్టెప్పులు, రవిపై వేసిన కౌంటర్లు ఫుల్ వైరల్ అయ్యాయి. అయితే చివర్లో రష్మి వేసిన స్టెప్పులు, నడుమును తిప్పిన తీరును తెగ వైరల్ అయింది. అయితే తాజాగా అచ్చం రష్మీలానే ఓ యువతి చేసేసింది.

అది చూసి యాంకర్ రష్మి ఫిదా.. సూపర్ రా అంటూ ప్రశంసలు!

రష్మీ తిప్పినట్టుగానే నడుమును తిప్పి, అచ్చం రష్మీలానే డ్యాన్స్ వేసింది. ఇంట్లో టీవీ ముందు ఆ యువతి వేసిన స్టెప్పులపై రష్మీ స్పందించింది. అచ్చం నాలానే చేశావ్.. సూపర్‌రా అంటూ ప్రశంసలు కురిపించింది. మొత్తానికి రష్మి ఏం చేసినా కూడా ఫాలో అయ్యేవాళ్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇక రష్మి ఇప్పుడు బుల్లితెరపై ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ షోలతో ప్రతీవారం తన అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆ తిప్పడం ఏంటో ఊపడం ఏంటో.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> మూడు సార్లు చావును చూసిన స్టార్ హీరోయిన్..అసలేం జరిగిందంటే..?

ఇది కూడా చ‌ద‌వండి ==> జబర్దస్త్ షోలో కలర్‌ఫుల్‌ కమెడియన్ సత్యశ్రీ .. తనవల్లే జబర్దస్త్ లో వారందరికీ అవకాశాలు వచ్చాయి.

ఇది కూడా చ‌ద‌వండి ==> మొన్న సమంత, ఇప్పుడు కాజల్ అగర్వాల్..వీరికేం పనిలేదా..?

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది