అరెస్ట్ పై స్పందించిన యాంకర్ శ్యామల భర్త.. వీడియో
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన యాంకర్ శ్యామల భర్త లక్ష్మీ నరసింహారెడ్డి చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. నరసింహారెడ్డి అరెస్ట్ పై మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చాయి. పెద్ద పెద్ద కేసుల్లో ఆయన ప్రమేయం ఉందంటూ పుకార్లు షికార్లు చేశాయి. కాని అసలు విషయం ఇది అంటూ నరసింహారెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా కూడా తప్పుడు వార్తలే అంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు.
తప్పుడు కేసు..
భర్త నరసింహారెడ్డి వీడియోను శ్యామల ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందులో నరసింహా మాట్లాడుతూ.. నాపై తప్పుడు కేసు బనాయించారు. అరెస్ట్ అయిన రెండు రోజుల్లోనే బయటకు వచ్చాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. కొందరు కావాలని నాపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు కేసు బనాయించడం ద్వారా నన్ను ఇబ్బందికి గురి చేయాలని వారు చూస్తున్నారు అంటూ నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమయంలో తనకు మద్దతుగా నిలిచి నా నిర్ధోశిత్వంను నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
కోటి రూపాయల వివాదం..
నరసింహారెడ్డి అరెస్ట్ అయిన కేసు వివరాల్లోకి వెళ్తే.. ఖాజా గూడాకు చెందిన సింధూరారెడ్డి అనే మహిళ వద్ద నరసింహా కొన్నాళ్ల క్రితం కోటి రూపాయలు తీసుకున్నాడట. ఆ మొత్తంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరగా డబ్బు ఇవ్వక పోగా బెదిరింపులకు దిగుతున్నాడు అంటూ ఆ మహిళ కేసు పెట్టింది. కేసులో నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ప్రస్తుతం బెయిల్ పై నరసింహా బయటకు వచ్చాడు. వీడియోలో నరసింహా మాట్లాడుతూ కేసును తప్పు దోవ పట్టించి నన్ను ఇరికించారు. రెండు రోజుల్లోనే నేను అసలు విషయాలు మీ ముందుకు తీసుకు వస్తానంటూ నరసింహా రెడ్డి అన్నాడు.
View this post on Instagram