Anchor Suma : ఆకాశాన్ని అందుకున్న సుమ.. తెగ సంబరపడిపోయిన యాంకర్
Anchor Suma : యాంకర్ సుమ ఎంత సరదాగా ఉంటారో.. ఎలాంటి పంచ్‌లు వేస్తారో తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దశాబ్దాలుగా బుల్లితెర ప్రేక్షకులను సుమ అలరిస్తూనే ఉంటుంది. అలాంటి సుమ ఇప్పుడు సోషల్ మీడియాలోని నెటిజన్లను కూడా కట్టిపడేస్తుంది. తన మాటలు, చేష్టలు, అల్లరితో నెట్టింట్లో సుమ సందడి చేస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాను వాడటంలో సుమ చాలా ముందుంటుంది.
Anchor Suma : సోషల్ మీడియాను ఇటు ఫ్యాన్స్‌కు దగ్గరవ్వడం కోసం మాత్రమే వాడకుండా.. ప్రకటనల ద్వారా సంపాదించేందుకు వాడుతూ ఉంటుంది. అలాంటి సుమ సోషల్ మీడియాలతో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తుంటుంది. తన అమ్మ, తన ఇంట్లోని పెట్స్, తన ఫాం హౌస్ ఇలా ఎన్నెన్నో విశేషాలను సుమ పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సుమ తన ఇన్ స్టా స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది.
అందులో సుమ ఆకాశాన్ని తాకినట్టు తెగ సంబరపడిపోయింది. ఆకాశంలో ఉన్న ఇంద్రధనస్సును కూడా టచ్ చేసినట్టు చిన్నపిల్లలా సంతోషపడింది. తన ఇంటి బాల్కనీలో ఉన్న సుమ ఆకాశాన్ని అలా అరిచేతిలో పట్టేసుకున్నట్టు చూపించింది. మొత్తానికి సుమ మాత్రం తెగ ఖుషీ అవుతోంది. ఇక ఇప్పుడు సుమ బుల్లితెర మీద ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. అంతే కాకుండా వారంలో రెండు మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా సుమ చేతిలో ఉంటున్నాయి.