Anchor Suma : పూజా హెగ్డేను మించింది.. ఊపు ఊపేసిన యాంకర్ సుమ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Suma : పూజా హెగ్డేను మించింది.. ఊపు ఊపేసిన యాంకర్ సుమ

 Authored By sandeep | The Telugu News | Updated on :3 March 2022,3:00 pm

Anchor Suma : యాంక‌ర్ సుమ‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న‌దైన పంచ్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచే యాంక‌ర్ సుమ ఇప్ప‌టికీ యంగ్ యాంక‌ర్ల‌కి పోటీ ఇస్తుంది. బుల్లితెర స్టార్ యాంక‌ర్‌గా సుమ ఇప్ప‌టికీ త‌న పేరుని అలానే లిఖించుకుంది. ఓ వైపు యాంక‌రింగ్ చేస్తూనే ఇప్పుడు వెండితెర‌పై కూడా అల‌రించేందుకు సిద్ధ‌మైంది. తన మాటలతో మెప్పించిన సుమ, తనలో నటనా సామార్థ్యాన్ని చూపించనున్నారు. అందుకు అనుగుణంగానే సినిమాల్లో లీడ్ రోడ్ లో నటించడం ప్రారంభించారు సుమ కనకాల. ప్రధాన పాత్రధారురాలుగా సుమ నటిస్తుండగా తనతో పాటు తదితర సీనియర్ యాక్టర్లు మూవీలో పలు రోల్స్ లో కనిపించనున్నారు.జ‌య‌మ్మ పంచాయ‌తీ అనే పేరుతో సుమ ఓ చిత్రం చేస్తుండ‌గా, ఈ చిత్రాన్ని బలప్రకాష్ నిర్మాతగా వెన్నెల క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు.

కాగా విజయ్ కుమార్ కలివరపు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణి మంచి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ప‌లు సాంగ్స్ తో పాటు ప్రోమోలు విడుద‌ల కాగా, ఇవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. అతి త్వర‌లో విడుద‌ల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎద‌రు చూస్తున్నారు.సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే యాంక‌ర్ సుమ అప్పుడ‌ప్పుడు ఫ‌న్నీ వీడియోలు సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య సుమ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించగా అందులో తనకు సంబంధించిన కామెడీ వీడియోలను, పలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలను అభిమానులను తెగ పంచుకుంటుంది.

Anchor Suma stunning dance to Pooja Hegde movie song

Anchor Suma stunning dance to Pooja Hegde movie song

Anchor Suma : సుమ ఎన‌ర్జీ లెవ‌ల్ వేరు…

అంతేకాకుండా తను ఇంట్లో చేసే అల్లరి పనులను కూడా తెగ షేర్ చేస్తుంది. కేవలం ఒక్క ఛానల్ లోనే కాకుండా అన్ని ఛానల్ లో సుమ ఆల్ రౌండర్ గా నిలిచింది.ఇటీవ‌ల న్ స్టా లో కూడా తెగ రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకుంది.అందులో ఎల్లో కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించుకొని వేరే లెవెల్ అంటూ ఓ మ్యూజిక్ కు తెగ స్టెప్పులేసింది.ఈవెంట్ కు ముందు ఇలా వార్మప్ అంటూ నడుమును వయ్యారంగా తిప్పుతూ తెగ సందడి చేసింది.పూజా హెగ్డేని మించి తిప్పుతున్నావుగా అంటూ నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. వీడియోని చూసి నెటిజన్లు, తన అభిమానులు లైకులు, కామెంట్లు పెడుతున్నారు. బీస్ట్ సినిమాలోని పాట కోసం సుమ ఇలాంటి స్టెప్పులు ట్రై చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Suma K (@kanakalasuma)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది