Naga Chaitanya Samantha : చైతన్య, సమంత మధ్య చిచ్చు పెట్టిన ఆ సినిమా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naga Chaitanya Samantha : చైతన్య, సమంత మధ్య చిచ్చు పెట్టిన ఆ సినిమా..?

Naga Chaitanya Samantha : అక్కినేని నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు డైవర్స్ తీసుకుని విడిపోవడానికి చాలా రకాల కారణాలు చెబుతుంటారు. ఇద్దరు దాదాపు 8 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాక రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. చైతన్య, సమంత డైవర్స్ వాళ్ల పర్సనల్ ఇష్యూనే అయినా మీడియా మాత్రం అదేదో పబ్లిక్ ఇష్యూలా హడావిడి చేస్తూ వచ్చింది. ఈమధ్యనే తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూడ చైతన్య, సమంత డైవర్స్ కి […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 October 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Naga Chaitanya Samantha : చైతన్య, సమంత మధ్య చిచ్చు పెట్టిన ఆ సినిమా..?

Naga Chaitanya Samantha : అక్కినేని నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు డైవర్స్ తీసుకుని విడిపోవడానికి చాలా రకాల కారణాలు చెబుతుంటారు. ఇద్దరు దాదాపు 8 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాక రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. చైతన్య, సమంత డైవర్స్ వాళ్ల పర్సనల్ ఇష్యూనే అయినా మీడియా మాత్రం అదేదో పబ్లిక్ ఇష్యూలా హడావిడి చేస్తూ వచ్చింది. ఈమధ్యనే తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూడ చైతన్య, సమంత డైవర్స్ కి కే టీ ఆర్ కారణమని చెప్పి షాక్ ఇచ్చారు.ఐతే లేటెస్ట్ గా చైతన్య, సమంత డైవర్స్ కు ఒక సినిమా కారణమని అంటున్నారు. నాగ చైతన్య సమంత కలిసి నటించిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఆటోనగర్ సూర్య తప్ప పెళ్లి తర్వాత నటించిన మజిలీ కూడా సూపర్ హిట్ అయ్యింది.

ఐతే ఇదే క్రమంలో సమంత తను నటించిన జాను సినిమాలో చైతన్యని హీరోగా చేయాలని అడిగిందట. తమిళ్ లో హిట్టైన 96 సినిమా తెలుగులో జాను గా రీమేక్ అయ్యింది. తమిళ మాత్రుక దర్శకుడే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఐతే ఈ సినిమాలో సమంత లీడ్ హీరోయిన్ కాగా చైతన్యని నటింపచేయాలని అనుకుంది. కానీ చైతన్య ఎంత చెప్పినా ఆ సినిమా చేయనని అన్నారట. దాని వల్ల వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయని టాక్. చైతన్య బదులుగా శర్వానంద్ ఆ సినిమా చేశారు. ఐతే ఆ సినిమా ఫస్ట్ కాపీ చూసిన దిల్ రాజు సినిమా పోతుందని ఫిక్స్ అయ్యారట.

Naga Chaitanya Samantha చైతన్య సమంత మధ్య చిచ్చు పెట్టిన ఆ సినిమా

Naga Chaitanya Samantha : చైతన్య, సమంత మధ్య చిచ్చు పెట్టిన ఆ సినిమా..?

అందుకే పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే సినిమాను రిలీజ్ చేశారు. సమంత కూడా ఈ సినిమా చైతన్య చేయలేనందుకు బాధపడిందట. అలా జాను సినిమా వల్ల ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగిందని అదే డైవర్స్ తీసుకునే దాకా వచ్చిందని అంటున్నారు. ఏది ఏమైనా నాగ చైతన్య, సమంతల డైవర్స్ మీడియాకు ఒక మంచి ట్రోల్ పాయింట్ గా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది