Ktr : కేటీఆర్ అనుకున్న‌దొక్క‌టి.. అయింది ఒక్క‌టి..ప్లాన్స్ అన్నీ తేడా కొడుతున్నాయిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ktr : కేటీఆర్ అనుకున్న‌దొక్క‌టి.. అయింది ఒక్క‌టి..ప్లాన్స్ అన్నీ తేడా కొడుతున్నాయిగా..!

Ktr : ప‌దేళ్లు అధికారంలో ఉండి ఆడిందే ఆట పాడిందే పాట అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన బీఆర్ఎస్ నాయ‌కుల‌కి గ‌డ్డు కాలం న‌డుస్తుంది. ఏదో కామెడీ చేద్దామనుకున్నా.. అది రివర్స్ అవుతుంది. అది కాస్తా ఆయన మెడకే చుట్టుకుంది. తెలిసి మాట్లాడుతున్నారా.. తెలియక మాట్లాడుతున్నారా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఉగాది పంచాంగంలోనే నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. అయినా తీరు మారలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసెంబ్లీలోనూ సీఎంను పేరు పెట్టి పిలిచి నాలుక కరుచుకున్నారు. కేటీఆర్ తపన […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 October 2024,7:00 pm

Ktr : ప‌దేళ్లు అధికారంలో ఉండి ఆడిందే ఆట పాడిందే పాట అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన బీఆర్ఎస్ నాయ‌కుల‌కి గ‌డ్డు కాలం న‌డుస్తుంది. ఏదో కామెడీ చేద్దామనుకున్నా.. అది రివర్స్ అవుతుంది. అది కాస్తా ఆయన మెడకే చుట్టుకుంది. తెలిసి మాట్లాడుతున్నారా.. తెలియక మాట్లాడుతున్నారా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఉగాది పంచాంగంలోనే నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. అయినా తీరు మారలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసెంబ్లీలోనూ సీఎంను పేరు పెట్టి పిలిచి నాలుక కరుచుకున్నారు. కేటీఆర్ తపన చూస్తే ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే తిరిగి అందులో వారే ఇరుక్కుంటున్నారు. ఏమీ చేయలేకపోతున్నారు. ఆ మ‌ధ్య సుంకిశాల దగ్గర రిటైనింగ్ వాల్ కూలింది. దీనిపై గట్టిగా మాట్లాడిన కేటీఆర్ చాలా ప్రశ్నలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంధించారు.

Ktr పాపం.. కేటీఆర్

సుంకిశాల దగ్గర వాల్ ఆగస్ట్ 2న కూలితే సీఎంగానీ ఇతరులు గానీ వెంటనే ఎందుకు వెళ్లలేరని ప్రశ్నించారు. మరి గతేడాది అక్టోబర్ లో మేడిగడ్డ కుంగితే నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలకు జవాబు లేదు. అమృత్ స్కీములో చాలా ఆరోపణలు చేశారు. అలాగే.. మూసీ సుందరీకరణలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక హైడ్రా అంశంలోనూ పలు విధాలా విమర్శలు చేశారు. వాటికి ప్రజల్లో పెద్దగా మైలేజీ రాలేదని సమాచాం. కేటీఆర్ చేస్తున్న వ్యూహాలన్నీ బెడిసికొడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీకే రూ.1,137 కోట్ల టెండర్లు కట్టబెట్టారంటూ రాద్ధాంతం చేశారు. ఈ ఆరోపణలపై సృజన్ రెడ్డి వెంటనే స్పందించి కేటీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించారు.

Ktr కేటీఆర్ అనుకున్న‌దొక్క‌టి అయింది ఒక్క‌టిప్లాన్స్ అన్నీ తేడా కొడుతున్నాయిగా

Ktr : కేటీఆర్ అనుకున్న‌దొక్క‌టి.. అయింది ఒక్క‌టి..ప్లాన్స్ అన్నీ తేడా కొడుతున్నాయిగా..!

కేటీఆర్ చేసిన తప్పుడు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షా 50 వేల కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తారంట అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. సంక్షేమ పథకాల కోసం నిధులు ఖర్చు చేస్తే కమీషన్లు రావనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ అంశాన్ని ఎంచుకుందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్ల వరకు మింగొచ్చని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీని ద్వారా వచ్చిన డబ్బులను సూటుకేసులను రాహుల్ గాంధీకి దోచి పెట్టొచ్చు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే.. కేటీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులు ఘాటుగా రిప్లై ఇచ్చారు. ‘మాది నిర్మాణం.. మీది విధ్వంసం’ అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. ఈ క్రమంలో ప్రభుత్వం హైడ్రాకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీఆర్ఎస్‌కు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ విషయంలోనూ కేటీఆర్ ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది. ఇప్పుడు కేటీఆర్‌కి అన్నిగండాలే ఎదురువుతున్నాయి అని అంటున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది