Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. క‌మ్యూనిటీ ఓట్ల గురించి ఆ ఇద్ద‌రు ప్ర‌స్తావ‌న‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. క‌మ్యూనిటీ ఓట్ల గురించి ఆ ఇద్ద‌రు ప్ర‌స్తావ‌న‌

 Authored By ramu | The Telugu News | Updated on :16 October 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. క‌మ్యూనిటీ ఓట్ల గురించి ఆ ఇద్ద‌రు ప్ర‌స్తావ‌న‌

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ కార్య‌క్ర‌మం రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. రెండు రోజులుగా నామినేష‌న్ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌గా, ఈ నామినేష‌న్ ర‌చ్చ‌గా సాగింది.కంటెస్టెంట్ల మధ్య తీవ్వ వాగ్వాదం, అరుచుకోవడాలు, సారీ చెప్పుకోవడాలు, ఏడుపులు, కక్ష సాధింపులు వంటివి చాలానే జరిగాయి. అయితే ఇక్క‌డ బిగ్ బాస్ ఇచ్చిన కండీష‌న్స్ ప్ర‌కారం ఎక్కువగా సార్లు హరితేజనే హ్యాట్ అందుకుంది. దాంతో తన రాయల్ క్లాన్ సభ్యులు ఎక్కువ నామినేషన్స్‌లో పడకుండా ఓజీ గ్యాంగ్‌నే నామినేట్ చేసింది హరితేజ. ఇక బిగ్ బాస్ తెలుగు 8 రీలోడ్ లాంచ్ అంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ రోజున అవినాష్, గంగవ్వ కలిసి ఆడి ఇమ్యూనిటీ షీల్డ్ సాధించుకున్నారు. దానిని ఒక్కసారే ఉపయోగించుకోవచ్చు అని, ఇప్పుడు వాడుకోవాలని అనుకుంటున్నారా అని బిగ్ బాస్ అడిగాడు.

Bigg Boss 8 Telugu మెహ‌బూబ్‌పై ఫైర్..

దాంతో ఆ షీల్డ్‌ను తాను నామినేషన్స్‌లో ఉన్నందున వాడుకుంటున్నట్లు అవినాష్ చెప్పాడు. అలాగే, ఇమ్యూనిటీ షీల్డ్ వాడుకోవడంతో పాటు తనకు బదులు ఇంకొకరిని నామినేషన్స్‌లో ఉంచాలి అని ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో రాయల్ క్లాన్ అంతా డిస్కస్ చేసిన తర్వాత హరితేజను తనకు బదులు నామినేషన్స్‌లో పెడుతున్నట్లు బిగ్ బాస్‌కు చెప్పారు. ఇక మొత్తానికి ఈ వారం నామినేష‌న్‌లో గౌతమ్, నిఖిల్, మణికంఠ, పృథ్వీ, నబీల్, యష్మీ, టేస్టీ తేజ, ప్రేరణ, హరితేజ తొమ్మిది మంది ఉన్నారు. బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో ఓ షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. సాధారణ రాజకీయ ఓట్లని తలపించేలా ఓటింగ్‌పై చర్చ జరిగింది. కమ్యూనిటీ ఓట్ల గురించి డిస్కషన్‌ జరిగింది. ఇదే ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది.

Bigg Boss 8 Telugu బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి క‌మ్యూనిటీ ఓట్ల గురించి ఆ ఇద్ద‌రు ప్ర‌స్తావ‌న‌

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. క‌మ్యూనిటీ ఓట్ల గురించి ఆ ఇద్ద‌రు ప్ర‌స్తావ‌న‌

ఈ సారి నామినేషన్లలో మెగా చీఫ్‌ అయిన కారణంగా మెహబూబ్‌ నామినేషన్‌కి దూరంగా ఉన్నారు. కానీ నబీల్‌ ఉన్నారు. ఆయనతోపాటు యష్మి, నిఖిల్‌, పృథ్వీరాజ్‌, గౌతమ్‌, హరితేజ, ప్రేరణ, మణికంఠ, టేస్టీ తేజ ఉన్నారు. ఈ నామినేషన్ల ప్రకియ పూర్తయిన తర్వాత నబీల్‌, మెహబూబ్‌ల మధ్య షాకింగ్‌ డిస్కషన్‌ జరిగింది. అదే ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. నబీల్‌, మెహబూబ్‌ కలిసి నామినేషన్లలో జరిగిన విషయం గురించి చర్చించుకున్నారు. సండే రోజు స్టార్టింగ్‌ స్టార్టింగే ఆ విషయం ఎందుకు లేచిందో అర్థం కాలే నాకు అంటూ నబీల్‌ ఆదివారం ఎపిసోడ్‌ గురించి మాట్లాడారు.ఇదే స‌మ‌యంలో దారుణమైన ప్లస్ ఏంటో తెలుసా? మనకు కమ్యూనిటీ ఉంది. ఆ ఓట్లు దారుణంగా పడతాయి. ఒకటి కచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరం నామినేషన్లలో ఉండకూడదు. ఇద్దరం ఉంటే డివైడ్‌ అవుతాయి. సింగిల్‌గా ఉంటే అన్ని ఒక్కరికే పడతాయని మెహబూబ్‌ వెల్లడించడం విశేషం. ఈ విషయంపై నెటిజన్లు, ఆడియెన్స్ మండిపడుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది